సమీక్ష : మై డియర్ మార్తాండం – అక్కడక్కడా నవ్వించే కామెడీ డ్రామా

My Dear Marthandam movie review

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : పృథ్విరాజ్,రాకేందు మౌళి,కల్పిక గణేష్

దర్శకత్వం : హరీష్ కే వీ

నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్

సంగీతం : పవన్

సినిమాటోగ్రఫర్ : రామిరెడ్డి

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ నవ్వులు పూయించే హాస్య నటుడు పృథ్వి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో హాస్య కథా చిత్రం “మై డియర్ మార్తాండం”.ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది,మరి పృథ్వీ ఎంత వరకు ప్రేక్షకులను అలరించారో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

నెల్లూరు జిల్లాలో కొవ్వూరు లో రాకేందు మౌళి మరియు కళ్యాణ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు.వీరు కొన్ని ఊహించని పరిస్థితుల్లో తాగిన మైకంలో ఒక మర్డర్ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటారు.వారి కేసుని వాదించేందుకు పెద్ద లాయర్లకు సరిపడా ఫీజు వీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉండకపోయే సరికి లాయర్ మార్తాండం(పృథ్వీ) అనే కొత్త లాయర్ ను సంప్రదించవలసి వస్తుంది.మరి ఈ హత్యా కేసు నుంచి ఈ ఇద్దరి స్నేహితులని మార్తాండం కాపాడగలిగాడా ఆ కేసు వాదనలో పూయించిన నవ్వులు థియేటర్లలో పేలాయా ఆఖరికి వారిద్దరూ కేసు నుంచి బయటకి రాగలిగారా అన్నది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ వస్తున్నారు.ఈ చిత్రంలో కూడా పృథ్వీకి తగ్గ మార్క్ కామెడీ లైన్ ను దర్శకుడు ఎంచుకోవడం ద్వారా మరోసారి నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యారు.ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించినటువంటి రాకేందు మౌళి మరియు కళ్యాణ్ లు వారి పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబర్చారు.నటులు జయప్రకాశ్ నారాయణ న్యాయమూర్తిగా మరో హాస్య నటుడు కృష్ణ భగవాన్ కీలక పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి.మధ్యలో వచ్చిన తాగుబోతు రమేష్ యొక్క పాత్ర కూడా తెరపై ఉన్నంత వరకు బాగానే నవ్విస్తుంది,అలాగే ఈ చిత్ర హీరోయిన్ కల్పిక గణేష్ కూడా మంచి నటన కనబర్చారు.ఇంకా మంచి నటిగా ఎదిగేందుకు కూడా ఈమెకు అవకాశం కూడా ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధానంగా మైనస్ పాయింట్లు చెప్పాలంటే కథలో అస్సలు ఎక్కడా లాజిక్ అనేది ఉండదు.హాస్యం ఉంటె చాలు మిగతా సినిమా అంతా ఎలా ఉన్నా పరవాలేదు అన్నట్టు ఈ చిత్రం ఉంటుంది.ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని ఫన్నీ కోర్టు సన్నివేశాలలో అయితే ఎక్కడా ఒక పొంతన ఉండదు.అవన్నీ చూడడానికి చాలా సిల్లీ గా ఉంటాయి.దానికి తోడు కథలో కూడా అంత కొత్తదనం కూడా కనిపించదు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూపించే సన్నివేశాలలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు.అలాగే పవన్ యొక్క సంగీతం మరియు గ్యారీ బి యొక్క ఎడిటింగ్ లు కూడా ఓకే అని చెప్పొచ్చు.ఇక దర్శకుడు హరీష్ కే వీ యొక్క పని తీరుకి వచ్చినట్టయితే ఒక్క లాజిక్ లను వెతికే అంశాన్ని పక్కన పెడితే ఒక లాయర్ తో కోర్టులో నవ్వులు పూయించడంలో కాస్త సక్సెస్ అయ్యారనే చెప్పాలి.కాకపోతే ఫస్టాఫ్ లో హాస్యం పెట్టిన శ్రద్ధ సెకండాఫ్ లో కూడా పెడితే బాగున్ను.

తీర్పు :

ఇక మొత్తానికి హాస్య సన్నిశాలతో కూడిన కోర్టు డ్రామాగా మై డియర్ మార్తాడం చిత్రం కథలో పెద్ద కొత్తదనం లేకపోయినా అక్కడక్కడా కొన్ని లాజిక్ లేని సీన్లతో ఫస్టాఫ్ కామెడీ గా సాగుతుంది.కానీ సెకండాఫ్ ని కూడా మరింత హాస్యభరితంగా దర్శకుడు తెరకెక్కిస్తే ఇంకా బాగుండేది.కేవలం హాస్య ప్రియులకు అయితే ఈ సినిమా నచ్చొచ్చు కానీ లాజిక్ ప్రకారంగా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది.

123telugu.com Rating : 2. 5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :