సమీక్ష : “నేనే వస్తున్నా” – డల్ గా సాగే హారర్ సైకో డ్రామా!

Nene Vasthunna Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ధనుష్, ఎలి అవ్రమ్, ఇంధుజ, యోగి బాబు తదితరులు

దర్శకత్వం : సెల్వ రాఘవన్

నిర్మాత: కలైపులి ఎస్ థాను

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్

ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’ తెలుగులో ‘నేనే వస్తున్నా’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

ప్రభు (ధనుష్) తన కూతురు, భార్యతో చాలా సంతోషంగా ఉంటాడు. లైఫ్ లో ఎలాంటి బాధలు ఉండవు. అయితే, ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ధనుష్ కూతురికి సోను అనే దెయ్యం పడుతుంది. అసలు ఆ సోనూ ఎవరు?, ఎందుకు ధనుష్ కూతుర్నే టార్గెట్ చేసింది?, ఖదీర్ (రెండో ధనుష్ క్యారెక్టర్)ను చంపాలని ఆ సోనూ ఎందుకు కోరుకుంటాడు?, అసలు ప్రభు కి – ఖదీర్ కి మధ్య సంబంధం ఏమిటి? వీరిద్దికీ సంబధించిన గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక ధనుష్, రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఖదీర్ పాత్రలో ధనుష్ నటన చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే క్లిష్టమైన కొన్ని హంటింగ్ సన్నివేశాల్లో కూడా ధనుష్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ ధనుష్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి.

ఇక ధనుష్ – కూతురికి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ఎలి అవ్రమ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే మరో హీరోయిన్ గా నటించిన ఇంధుజ కూడా చాలా బాగా నటించింది. యోగి బాబు పంచ్ లు పర్వాలేదు. ప్రభుతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల బెటర్ గా ఉన్నా… చాలా చోట్ల బొర గా సాగాయి. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

పైగా సెకెండ్ హాఫ్ లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు ఖదీర్ ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు బాగాలేదు. దీనికితోడు సెకెండ్ హాఫ్ లో చాలా సీన్స్ మరీ సినిమాటిక్ గా సాగుతాయి. ఇలాంటి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్ లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్ ను రాసుకోకుండా ఉండాల్సింది. పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది.

ఓవరాల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే.. సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్ ఓం ప్రకాష్. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు సెల్వ రాఘవన్ మంచి కథను తీసుకున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్లే ను రాసుకుని, సినిమాని తీసి ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా కూడా మరో స్థాయిలో ఉండేది.

 

తీర్పు :

 

విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ లో కొన్ని ఆకట్టుకునే సస్పెన్స్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ పర్వాలేదు. ధనుష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ బాగా స్లోగా బోర్ గా సాగడం, అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాలు బోర్ గా సాగడం మరియు లాజిక్ లెస్ సీక్వెన్సెస్ వంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ ‘నేనే వస్తున్నా’ థిల్లర్ థ్రిల్ చేయలేక పోయింది. ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :