సమీక్ష : నెక్స్ట్ ఏంటి – స్లోగా సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సందీప్ కిషన్, తమన్నా, నవదీప్, పూనమ్ కౌర్ తదితరులు.

దర్శకత్వం : కునాల్ కోహ్లీ

నిర్మాత : గౌరీ కృష్ణ

సంగీతం : లియాన్ జోన్స్

సినిమాటోగ్రఫర్ : మనీష్ చంద్ర భట్

ఎడిటర్ : అనిల్ కుమార్ బొంతు

బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో సందీప్ కిషన్ ,తమన్నా , నవదీప్ ముఖ్య పాత్రల్లో వచ్చిన చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. లియాన్ జోన్స్ అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 కథ :

 

టామీ (తమన్నా) సెక్స్ కి అతీతమైన నిజమైన ప్రేమను కోరుకుంటుంది. ఈ క్రమంలో తన బాయ్ ఫ్రండ్స్ తో సెట్ అవ్వక బ్రేకప్ చెబుతూ ఉంటుంది. అలాంటి టామీ లైఫ్ లోకి అనుకోకుండా సంజూ (సందీప్ కిషన్) వస్తాడు. ఫస్ట్ మీట్ లోనే ఇద్దరికీ ఒకరి పై ఒకరికి ఇంట్రస్ట్ కలుగుతుంది. దాంతో ఇద్దరూ ఆరు నెలలు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ వారి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదు. ఈ విషయం పై అసహనానికి గురైన సంజూ (సందీప్ కిషన్) టామీతో అర్గ్యూ చేస్తాడు. ఆ ఆర్గ్యుమెంట్ కారణంగా ఇద్దరూ విడిపోతారు.

ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టామీ లైఫ్ లోకి క్రిష్ (నవదీప్) వస్తే.. సంజూ లైఫ్ లోకి వేరే అమ్మాయి వస్తోంది. మరి చివరికి ఎవరెవరు కలుస్తారు ? టామీ, సంజు కలుస్తారా ? కలిస్తే టామీ కోరుకున్న ప్రేమ సంజు నుండి దొరుకుతుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 ప్లస్ పాయింట్స్ : 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన తమన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంటూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సెక్స్ కి అతీతమైన నిజమైన ప్రేమను కోరుకున్నే అమ్మాయిగా.. అలాగే ప్రేమ గురించి ఆమె పాయింటాఫ్ వ్యూలో చెప్పిన కొన్ని డైలాగ్ లు కూడా చాలా బాగున్నాయి.

ఇక హీరోగా నటించిన సందీప్ కిషన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా, స్టైలిష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు.

తమన్నా తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు శరత్ బాబు ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. తమన్నాకు ఆయనకు మధ్యన సాగిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. ఇక నవదీప్, పూనమ్ కౌర్ తో సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని హిందీలో తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ, సినిమాలో మంచి థీమ్ తో పాటు మంచి క్యారెక్టరైజేషన్స్ రాసుకున్నారు. సినిమా మొత్తం లండన్ నేపథ్యంలో సాగడంతో అక్కడి విజువల్స్ కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

 మైనస్ పాయింట్స్ : 

సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ గా, అక్కడక్కడ ఎమోషనల్ గా సాగుతూ పర్వాలేదనిపిస్తే.. సెకెండాఫ్ మాత్రం గమ్యం లేని ప్రయాణంలా సాగుతూ.. అనవసరమైన సన్నివేశాలతో ఏ మాత్రం ఆసక్తి కలిగించలేని కథనంతో బోర్ కొట్టిస్తోంది.

దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న అంశాలు విజువల్ గా మరియు ఇన్సిడెంట్ల రూపంలో కాకుండా.. ప్రతిదీ డైలాగ్ ల రూపంలో చెప్పడంతో ప్రేక్షకులు ఆ సౌండ్ పొల్యూషన్ కి తట్టుకోలేక బాగా అసహనానికి గురవవుతారు.

పైగా తమన్నా క్యారెక్టరైజేషన్ మొదట్లో ఇంట్రస్ట్ గా అనిపించినప్పటికీ.. చివరికి వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్ కి క్లారిటీ మిస్ అయి విసుగు పుట్టిస్తోంది. అలాగే సినిమాలో చాలా చోట్ల నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది.

ఓవరాల్ గా బలహీన సంఘటనలతో సాగే కథనంలో.. బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. దర్శకుడు కథలో కీలకమైన అంశాలను మరియు సన్నివేశాలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

 సాంకేతిక విభాగం : 

ఈ చిత్ర దర్శకుడు కునాల్ కోహ్లీ మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అలాగే తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం అయితే చేశాడు గాని అది పూర్తీ సంతృప్తికరంగా సాగలేదు. ఆయన సెకెండడాఫ్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే సినిమా కొంతవరకు పర్వాలేదనిపించేది.

మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అనిల్ కుమార్ బొంతు ఎడిటింగ్ పర్వాలేదు కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 తీర్పు : 

బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో సందీప్ కిషన్ ,తమన్నా, నవదీప్ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. దీనికి తోడు సెకెండాఫ్ కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తోంది. మొత్తానికి తమన్నా, సందీప్ కిషన్ ల నటన ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు. అయితే సినిమాలో తమన్నాకు శరత్ బాబుకు మధ్యన సాగిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :