సమీక్ష : “ఓరి దేవుడా” – డీసెంట్ గా సాగే ఫాంటసీ రోమ్ కామ్

Ori Devuda Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్

దర్శకత్వం : అశ్వత్‌ మరిముత్తు

నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి

సంగీతం: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన

ఎడిటర్స్: విజయ్ ముక్తవరపు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వెంకీ మామ గెస్ట్ గా నటించిన చిత్రం “ఓరి దేవుడా” కూడా ఒకటి. మరి ఓ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. అర్జున్(విశ్వక్ సేన్) అలాగే అను(మిథిలా పాల్కర్) ఇద్దరు కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ అయితే అను వల్ల అర్జున్ ఆమెని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అర్జున్ ఓ జాబ్ లో జాయిన్ అవుతాడు. కానీ మెల్లగా తన సీనియర్ మీరా(ఆశా భట్) ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. మరి దీనితో అయితే తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. మరి ఈ క్లిష్ట పరిస్థితిలో వారి జీవితాల్లోకి వచ్చిన దైవం(వెంకటేష్) ఏం చేస్తాడు? అర్జున్ అను విడిపోతారా? చివరికి ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో చూసిన తర్వాత ఆడియెన్స్ కి బాగా ఇంప్రెసివ్ గా ఓ రకమైన ఆశ్చర్యంగా అనిపించే మొదటి అంశం ఏదన్నా ఉంది అంటే అది వెంకీ మామ పాత్రే అని చెప్పాలి. తాను ఈ రోల్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడమే కాకుండా ఆ రోల్ ని చాలా హుందాగా ఎంటర్టైనింగ్ గా కంప్లీట్ చేసారు. ముఖ్యంగా తన లుక్ ఈ సినిమాలో చాలా బాగుంది. మంచి యంగ్ గా వింటేజ్ లుక్స్ లో తాను కనిపించారు.

ఇక యువ హీరో విశ్వక్ విషయానికి వస్తే.. విశ్వక్ ఇప్పటివరకు చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేసాడు. వాటిలో తనకి తగ్గట్టుగా బాగా సూట్ అయ్యిన పాత్రల్లో ఈ అర్జున్ కూడా ఒకటని చెప్పొచ్చు. దీనిని చాలా నీట్ గా తాను రక్తి కట్టించాడు. మంచి ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఇద్దరు హీరోయిన్స్ తో కూడా మంచి కెమిస్ట్రీ వారి మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి.

ఇంకా హీరోయిన్ మిథిలా విషయానికి వస్తే తాను డీసెంట్ నటన కనబరిచింది. ఈ రోల్ కి తగ్గట్టుగా విశ్వక్ తో కనిపించి మెప్పిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో ఆమె నటన చెప్పుకోవచ్చు. ఆలాగే మరో ఫీమేల్ లీడ్ ఆశా భట్ తన పాత్ర పరిధి మేరకు అయితే ఆకట్టుకుంది. వీరితో పాటుగా సినిమాలో ఆకట్టుకునే అంశాలు సెకండాఫ్ లో బాగున్నాయి. కథనం, మంచి కామెడీ సహా అన్ని అంశాలు సెకండాఫ్ లో అయితే బాగా పికప్ అయ్యి ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. ఇంకా తరుణ్ భాస్కర్ సహా ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు మెప్పిస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మంచి ఎంగేజింగ్ మారి ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకోడానికి బాగా ఎక్కువ సమయాన్నే తీసుకుంది అని చెప్పాలి. సెకండాఫ్ లో అంశాలు తప్ప ఫస్ట్ హాఫ్ లో సినిమాలో కాస్త డల్ నరేషన్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ అను రోల్ లో కూడా చాలా డెప్త్ మిస్ అవుతుంది. కొన్ని చోట్ల ఎఫెక్టీవ్ గా కనిపించే ఆమె పాత్ర కాస్త కంప్లీట్ కానీ రోల్ లా అనిపిస్తుంది.

ఆమె విషయంలో ఇంకా డీటైల్డ్ నరేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే ఈ తరహా సినిమాల్లో వి ఎఫ్ ఎక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ వీటిని మాత్రం ఈ చిత్రం ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని బోరింగ్ సన్నివేశాలు అయితే ఫస్ట్ హాఫ్ లో తగ్గించాల్సింది. వీటి మూలాన స్టార్టింగ్ నుంచి అయితే సినిమాపై అంత ఆసక్తి కలదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే టెక్నీకల్ టీం లో విజువల్ ఎఫెక్ట్ అంశంపై ఎక్కువ దృష్టి పెడితే బాగుండు. ఇంకా లియోన్ జేమ్స్ ఇచ్చిన మ్యూజిక్ సహా స్కోర్ లు బాగున్నాయి. విజువల్ గా సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. విధు కెమెరా వర్క్ బాగుంది. ఇంకా డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బెటర్ గా చెయ్యాల్సింది.

ఇక దర్శకుడు అశ్వత్ విషయానికి వస్తే.. ఒరిజినల్ ని తెరక్కేకించినట్టే తెలుగులో కూడా డీసెంట్ జాబ్ తాను అయితే అందించాడు. సెకండాఫ్ లో పర్వాలేదు కానీ ఫస్ట్ హాఫ్ నుంచే నరేషన్ ని బాగా చూపించినట్టు అయితే డెఫినెట్ గా మరింత మంచి ఫలితం ఈ సినిమాకి దక్కి ఉండేది. అలాగే నటీనటుల నుంచి అయితే తాను మంచి నటనను రాబట్టుకున్నాడు. ఇక్కడ వరకు అయితే తన వర్క్ మెప్పిస్తుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఫాంటసీ టచ్ తో వచ్చిన ఈ రోమ్ కామ్ డ్రామా “ఓరి దేవుడా” లో విశ్వక్ సహా మిథిలా లు మంచి పాత్రల్లో ప్రామిసింగ్ నటన తో మెప్పిస్తారు. అలాగే సినిమాకి బిగ్ ప్లస్ గా వెంకీ మామ చేసిన పాత్ర నిలిచింది. ఈ కలయికలో అయితే సెకండాఫ్ లో పలు అంశాలు బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. అయితే అంత ఆకట్టుకోని ఫస్ట్ హాఫ్ ని పక్కన పెడితే ఈ చిత్రం ఆడియెన్స్ ని ఈ వారాంతంలో మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :