ఓటిటి సమీక్ష : “బ్లడీ మేరీ” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో

ఓటిటి సమీక్ష : “బ్లడీ మేరీ” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో

Published on Apr 16, 2022 3:04 AM IST
Bloody Mary Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నివేతా పెత్తురాజ్, బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్ కుమార్

దర్శకత్వం : చందూ మొండేటి

సంగీత దర్శకుడు: కాల భైరవ

రచన : ప్రశాంత్ కుమార్ దిమ్మల

ఎడిటర్ : విప్లవ్ నిశ్శబ్దం

లేటెస్ట్ గా థియేటర్స్ లో భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ కాగా ఇప్పుడు ఓటిటిలో కూడా ఓ సినిమా రిలీజ్ అయ్యింది అదే “బ్లడీ మేరీ”. యంగ్ నటి నివేతా పెత్తురాజ్ కీలక పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో విడుదల అయ్యింది మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే ఓ అనాథ అయినటువంటి మేరీ(నివేతా) తనకి ఇద్దరు స్నేహితులు బాషా (కిరీటి) మరియు రాజు (రాజ్ కుమార్) లతో కలిసి పెద్దవుతుంది. మంచి స్నేహితులు అయిన ఈ ముగ్గురిలో ఓ నర్స్ గా మేరీ పని చేస్తుంది. అయితే అనుకోని విధంగా ఈ ముగ్గురు కూడా ఒక్కో దారుణ హత్య కేసుల్లో నిందితులుగా ఇరుక్కుంటారు. అయితే వీరి జీవితాల్లో ఎదురైన ఈ షాకింగ్ సీరియల్ హత్యలకి కారణం ఎవరు? ఈ సమస్య నుంచి వారు బయట పడ్డారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని “ఆహా” లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధాన హైలైట్ గా మెయిన్ కాస్ట్ అని చెప్పాలి. మూడు కీలక పాత్రలకి గాను ముగ్గురు నటులు మంచి నటనను కనబరిచారు. మొదటగా మేరీ గా కనిపించిన నివేతా పెత్తురాజ్ అయితే చాలా క్లియర్ నటనను అందించింది అని చెప్పాలి. తన రోల్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా నటించింది.

అలాగే సినిమాలో తన పాత్ర డెవలెప్మెంట్ పెరిగే కొద్దీ మరింత స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ని తాను కనబరిచింది. అలాగే మరో టాలెంటెడ్ నటుడు కిరీటి చాలా ఫైనెస్ట్ నటనను కనబరిచాడు. ఫిజికల్లీ ఛాలెంజెడ్ రోల్ లో కనిపించిన తాను మంచి ఎమోషన్స్ ని ఈ సినిమాలో పండించి కీలకంగా మారాడు.

ఇక అలాగే మూడో వ్యక్తి రాజ్ కుమార్ కూడా మంచి నటనను కనబరిచి ఆకట్టుకున్నాడు. పలు చోట్ల అతడి కామెడీ టైమింగ్ అయితే బాగుంది. ఇంకా మరో కీలక పాత్రలో నటించిన నటుడు అజయ్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించాడని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో పలు సన్నివేశాలు మంచి థ్రిల్ ని అందిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం మొదలైన కాసేపటికే వ్యూవర్స్ తాలూకా అటెన్షన్ ని బాగానే అందుకుంటుంది కానీ కథనం కొనసాగే కొద్దీ అదైతే నిలబడలేదు. అలాగే చాలా వరకు సీరియస్ నెస్ ఎక్కడా కనిపించదు. పలు సన్నివేశాల్లో అయితే మరింత డ్రామా యాడ్ చెయ్యడానికి స్కోప్ ఉన్నా వాటిని సింపుల్ గా తేల్చేసారు.

అలాగే కొన్ని సన్నివేశాలు అయితే మరీ లాజిక్ లేని విధంగా ఉంటాయి. అలాగే నివేతా పై చివరిలో చూపించిన కాస్త ఎలివేటెడ్ సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోవు. వీటిపై దర్శకుడు దృష్టి పెట్టాల్సింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగా కనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం వర్క్ విషయానికి వస్తే మ్యూజిక్ వర్క్ చాలా బాగుంది. అలాగే డైలాగ్స్ మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు చందూ మొండేటి విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉందని చెప్పాలి. మంచి థీమ్ ని తాను తీసుకున్నాడు అలాగే పలు చోట్ల కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ తన మార్క్ కి తగ్గట్టు అయితే లేవని చెప్పక తప్పదు. చాలా సీన్స్ ని మరింత ఆసక్తిగా మలిచే అవకాశం ఉన్నా వాటిని అంత బాగా తెరకెక్కించలేదు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బ్లడీ మేరీ” లో మెయిన్ లీడ్ నటీనటుల పెర్ఫామెన్స్ లు డెఫినెట్ గా ఆకట్టుకుంటాయి. అలాగే పలు చోట్ల కొన్ని ఎలిమెంట్స్ థ్రిల్ ని అందిస్తాయి. కానీ పలు చోట్ల కథనం మాత్రం అంతగా ఆకట్టుకోదు, స్టార్టింగ్ లో అంతా బానే ఉంటుంది కానీ తర్వాత మాత్రం కథనం డెవలప్మెంట్ డిజప్పాయింట్ చేస్తుంది. సో ఈ వారాంతానికి అయితే ఈ చిత్రం అంత థ్రిల్ చెయ్యకపోవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు