ఓటిటి సమీక్ష : నయనతార ‘నెట్రికన్’ చిత్రం హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : నయనతార ‘నెట్రికన్’ చిత్రం హాట్ స్టార్ లో

Published on Aug 14, 2021 3:02 AM IST
Netrikann movie review

విడుదల తేదీ : ఆగస్టు 13, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు: నయనతార, అజ్మల్, మణికందన్, శరణ్
దర్శకుడు: మిలింద్ రావు
నిర్మాత: విఘ్నేష్ శివన్, కె.ఎస్. మైలవగణన్
సంగీత దర్శకుడు: గిరీష్ గోపాలకృష్ణన్
ఎడిటర్: లారెన్స్ కిషోర్


ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “నెట్రికన్”. స్టార్ హీరోయిన్ నయనతార మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదల అయ్యింది. తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కాబడిన ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి..

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే దుర్గ(నయనతార) ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కానీ ఆమె ఒక అంధురాలు.. అయితే ఓ ఊహించని సీరియల్ రేపిస్ట్ కేసు విషయంలో ఆమె ప్రమేయం కావాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో దుర్గ ఆ సీరియల్ రేపిస్ట్ ను ఎలా పట్టుకోగలుగుతుంది? చేసేది ఎవరు అసలు ఆమె వెనుక ఏమన్నా కథ ఉందా అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

నయనతార కి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కొత్తేమి కాదు చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ ని నయన్ సునాయాసంగా చేసింది. కానీ ఇక్క ఇది వరకు చేసిన వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్ రోల్ ఒక అంధురాలిగా పోలీస్ గా కూడా కనిపిస్తుంది మరి ఈ రోల్ ను మొదటి నుంచి కూడా తన భుజాలపై తీసుకెళ్లింది. చాలా నీట్ గా అద్భుతమైన నటనను ఈ చిత్రంలో తాను చూపింది.

అలాగే మరో ఇతర కీలక పాత్రల్లో కనిపించిన మణికందకన్ కూడా బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అజ్మల్ తదితరులు తమ రోల్స్ కి న్యాయం చేకూర్చారు. అలాగే ఈ సినిమాలో అక్కడక్కడా ఎమోషన్స్ కూడా మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఓ సీన్ అయితే చిత్రంలో మెట్రో ట్రైన్ లో డిజైన్ చేసింది కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ గా చెప్పుకొనే అంశాలు కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఈ చిత్రం మొదలైన అరగంట వరకు మెయిన్ స్టోరీ లోకి ఏంటి అన్నది వెళ్ళదు. పైగా బాగా స్లో గా సాగే నరేషన్ సినిమా చూసే వారిలో ఇంట్రెస్ట్ ని పలు చోట్ల తగ్గిస్తుంది. అయితే నయన్ రోల్ ని మరింత ఆసక్తికరంగా డిజైన్ చేసి చూపిస్తే బాగున్ను అనే అభిప్రాయం ఈ చిత్రం చూసాక కలుగుతుంది.

అలాగే ఇంటర్వెల్ బ్లాక్ వరకు కూడా పెద్దగా హైలైట్ అని చెప్పుకొనే సన్నివేశాలు కూడా పెద్దగా ఉండకపోవడం మరో మైనస్. వీటితో పాటుగా కథనం చాలా మేర మనం ఊహించదగినట్టే ఉంటుంది. క్లైమాక్స్ మరియు ప్రీ క్లైమాక్స్ ని కూడా ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

టెక్నీకల్ గా ఈ డార్క్ బేస్డ్ డ్రామా వర్క్ పర్వాలేదని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఈ చిత్రంలో డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే నిర్మాణ విలువలు కూడా పర్వాలేదని చెప్పొచ్చు. ఇక దర్శకుడు మిలింద్ రావ్ విషయానికి వస్తే ఓ కొరియన్ థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పలు లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా కథనం ఇంట్రెస్టింగ్ గా చూపించలేదు. చాలా స్లోగా రొటీన్ కథనంలోనే ఈచిత్రం కనిపిస్తుంది. ఇంకా మంచి ఎలిమెంట్స్ జోడించి చిత్రాన్ని డీల్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నటైతే ఈ “నెట్రికన్” చిత్రంలో కొన్ని అంశాలు పర్వాలేదు అనిపిస్తాయి.. అలాగే నయనతార నటన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇతర నటుల పెర్ఫామెన్స్ లు కూడా ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్షన్ లో చాలా డ్రా బ్యాక్స్ కనిపిస్తాయి. ఆసక్తిగా సాగని కథనం ఊహించగలిగే విధంగా సినిమా అంతా ఉండడం సోసో గానే అనిపిస్తుంది. వీటన్నిటి బట్టి అయితే స్ట్రిక్ట్ గా ఒక్క నయన్ కోసం మాత్రం అయితే ఓసారి ఈ సినిమా చూడొచ్చు.

 

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు