ఓటీటీ సమీక్ష: షేర్షా – హిందీ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం (సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ)

Published on Aug 13, 2021 12:05 am IST
Shershaah review

విడుదల తేదీ : ఆగస్టు 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ :  3.25/5

నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ

దర్శకులు: విష్ణువర్ధన్

నిర్మాతలు : కరన్ జోహర్, హిరూ యాష్ జోహర్, అపూర్వ మెహ్త, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ

సంగీతం : జాన్ స్టేవార్ట్ ఎదూరి

సినిమాటోగ్రఫీ : కమల్‌జీత్ నేగి

ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్


ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో తాజాగా మేము ఎంచుకున్న చిత్రం “షేర్షా”. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన హిందీ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

విక్రమ్ బాత్రా (సిద్ధార్థ్ మల్హోత్రా) హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణాఇకి చెందినవాడు. చిన్ననాటి నుండి అతడికి ఉన్న ఏకైక కల ఆర్మీ ఆఫీసర్ కావడం. ఆర్మీ ఆఫీసర్‌గా మారాకా 1999లో కార్గిల్ యుద్ధంలో విక్రమ్ మరియు అతని బృందం యొక్క వీరోచిత పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే విక్రమ్ బాత్రా ఆ యుద్ధంలో విజయం సాధించాడు మరియు ఎలా విజేతగా బయటపడతాడు అనేది షేర్షా కథ.

ప్లస్ పాయింట్స్:

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ షేర్షా. విక్రమ్‌కి సిద్ధార్థ్ మల్హోత్రా సరిగ్గా సరిపోయాడు. మరియు సినిమాలో బాగా నటించాడు. సిద్ధార్థ్ ఈ చిత్రంలో చక్కటి భావోద్వేగాలను కనబరిచాడు.

కియారా అద్వానీ సిద్ధార్థ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. నిజ జీవిత జంట ఈ చిత్రంలో ప్రేమికులుగా అత్యుత్తమంగా రాణిస్తారు మరియు వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. యాక్షన్ బ్లాక్‌లు మరియు మొత్తం ప్రొడక్షన్ డిజైన్ నిజంగా ఆకట్టుకునేలా ఉన్నందున యుద్ధ సన్నివేశాలకు అది బాగా కలిసొచ్చింది.

చిత్రం యొక్క చివరి అరగంట తీవ్రమైన యుద్ధ డ్రామాతో నిండి ఉంది మరియు విక్రమ్ బాత్రా యొక్క వీరత్వాన్ని మరియు అతను దేశాన్ని ఎలా కాపాడాడో చక్కగా తెలియజేస్తుంది. పాటలన్నీ చాలా ఎమోషనల్‌గా ఉండడంతో సినిమా సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రానికి ఉన్న అతిపెద్ద లోపాలలో ఒకటి బలహీనమైన సహాయక తారాగణం. సిద్ధార్థ్ మల్హోత్రా తప్పా మిగతా నటులు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కొంతమంది తెలిసిన నటులు ఉండి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా మారేది.

ఇకపోతే సిద్ధార్థ్ మరియు కియారాల మధ్య ప్రేమ కథ కూడా బాగా సాగదీయబడింది. మొదటి అరగంట పాటు సాగిన ఈ ప్రేమ కథ చాలా స్లోగా సాగింది. అలాగే ఫస్ట్ హాఫ్‌లో కీలక ప్రాంతాల్లో సరైన భావోద్వేగాలు కనిపించలేదు, హీరో తల్లిదండ్రులు స్పందించే తీరు, సైనికులు మరణించినప్పుడు మొత్తం కుటుంబ కోణం, ఈ అంశం ఆ ప్రభావాన్ని పెద్దగా చూపలేకపోయాయి.

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మరియు వార్ సెటప్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కెమెరా పనితీరు చాలా బాగుంది. సినిమాను వాస్తవికంగా చూపించడంలో ఇది బాగా ఉపయోగపడింది. డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి మరియు యువన్ శంకర్ రాజా అందించిన బీజీఎం కూడా ఆకట్టుకుంది.

దర్శకుడు విష్ణువర్ధన్ విషయానికి వస్తే అతను తన తొలి హిందీ చిత్రంతోనే మంచి ప్రభావం చూపించాడని తెలుస్తుంది. తమిళ దర్శకుడు తన అనుభవాన్ని ఉపయోగించుకుని సినిమాను చక్కగా వివరించి చాలా భావోద్వేగంతో మరియు గర్వంగా ముగించారు. అతను కార్గిల్ యుద్ధాన్ని చాలా వివరంగా చూపించాడు. అయితే సినిమలో సహాయక తారాగణం కోసం మంచి నటులను తీసుకుని వెళ్లినట్టైతే సినిమా మరో లెవల్‌లో ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “షేర్షా” అనేది మంచి యాక్షన్ బ్లాక్‌లు మరియు ఆకట్టుకునే భావోద్వేగాలను కలిగి ఉన్న ఒక మంచి గ్రిప్పింగ్ వార్ డ్రామా. సహాయక తారాగణం మరియు కథ మొదట్లో నెమ్మదిగా ప్రారంభం అవ్వడం వంటి అంశాలను పక్కనపెడితే కార్గిల్ హీరో విక్రమ్ బాత్రాపై నిర్మించిన ఈ బయోపిక్ ఈ వారం ప్రతి ఒక్కరికి కూడా మంచి వీక్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :