సమీక్ష : ఆక్సిజన్ – అక్కడక్కడా మెప్పించింది

Oxygen movie review

విడుదల తేదీ : నవంబర్ 30, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : జ్యోతి కృష్ణ

నిర్మాత : ఎస్. ఐశ్వర్య

సంగీతం : యువన్ శంకర్ రాజా

నటీనటులు : గోపీచంద్, అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా

గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ‘ఆక్సిజన్’ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమాతో గోపీచంద్ ప్రేక్షకులను అలరించాడా ? లేదా ? ఇప్పుడు చూద్దాం.

కథ :

సంజీవ్ (గోపీచంద్) ఆర్మీలో పని చేస్తూ ఉంటాడు. మూడు సంవత్సరాల తరువాత సొంత ఊరికి వచ్చి తను ప్రేమించిన అమ్మాయి గీత (అను ఇమ్మానుల్)ను కలిసి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. టైగర్ బ్రాండ్ సిగరెట్ వల్ల సంజీవ్ తన తమ్ముడిని కోల్పోతాడు. అందుకు కారణమైన ఆ బ్రాండ్ యజమాని పై పగ తీర్చుకుందామని పల్లెటూరుకు వస్తాడు సంజీవ్. ఆ తరువాత సంజీవ్ కృష్ణ ప్రసాద్ గా ఎలా మారాడు ? శృతి (రాశీ ఖన్నా)ను వివాహం చేసుకున్నాడా ? టైగర్ బ్రాండ్ యజమానిని సంజీవ్ ఏం చేసాడు ? అన్నది తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎంచుకున్న పాయింట్ బాగుంది. యువత సిగరెట్స్ కు అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటిదాన్ని అంతం చెయ్యాలనుకొని హీరో చేసే ప్రయత్నం బాగుంది. జగపతి బాబు పల్లెటూరు మనిషిగా, డాన్ గా బాగా నటించాడు. ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంది. దాంతో ద్వితియార్థంపై ఆసక్తి నెలకొంది.

రాశీ ఖన్నా, గోపీచంద్ ల జోడీ బాగుంది. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేసింది. అంబితేగాక సెకండాఫ్లోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించింది. సావిత్రి పాత్రలో అలీ చేసిన ఫన్ కొంత నవ్వించింది. క్లైమాక్స్ కొద్దిగా లెంగ్తీగానే ఉన్నా కీలకమైన జగపతిబాబు పాత్రలోని ఊహించని ట్విస్ట్ సప్రైజింగా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

మంచి కథ రాసుకున్న డైరెక్టర్ దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కొంతవరుకు విఫలం అయ్యాడు. కథకు అవసరం లేని గ్రామీణ నేపద్యం ఎంచుకొన్న ఆయన అనవసర సన్నివేశాలను రాసుకొని సినిమా నిడివిని పెంచేసి ఇబ్బందిపెట్టాడు. అవసరంలేని సన్నివేశాల్ని తొలగించి త్వరగా అసలు కథలోకి సినిమాను తీసుకెళ్ళుంటే బాగుండేది.

ఇక పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకడు తప్పు చేస్తే వాడి దగ్గరికి వెళ్లి వాడితో మంచిగా ఉండి వారికి తెలీకుండా వాడి ఫ్యామిలి మొత్తాన్ని అంతం చెయ్యడం చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో కూడా హీరో అదే చేశాడు కాబట్టి చాలా చోట్ల తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని సులభంగా ఊహించవచ్చు. దాంతో చూసే ప్రేక్షకుడికి సినిమాపై పెద్దగా ఆసక్తి కలగదు. దర్శకుడు రాసుకున్న కథకు దాన్ని తీసిన విధానానికి అస్సలు సంభంధం లేకపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం:

దర్శకుడు జ్యోతి కృష్ణ అనుకున్న పాయింట్, రాసుకున్న స్క్రిప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. కొన్ని ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఉన్నా అనవసరమైన సీన్లతో లెంగ్త్ ఎక్కువై బోర్ కొట్టింది.

చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యమైన సంభాషణలు బాగున్నాయి. సినిమా నిడివి బాగా ఎక్కువగా ఉంది. ఎడిటర్ ఉద్దవ్ మొదటి సగంలో కొన్ని అవసరంలేని సన్నివేశాలని కత్తిరించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమా రిచ్ గా కనిపించింది.

తీర్పు:

ఈ సినిమా కథ నినడానికి బాగుంది. కాని దర్శకుడు దాన్ని తెరమీద చూపించిన విధానం గొప్పగా లేదు. గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు, షియాజీ షిండే వంటి భారీ తారాగణం ఉన్నా పాత సీన్స్, బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే వలన నిరుత్సాహం ఎదురైంది. సరిగాలేని నరేషన్ ను తట్టుకోగలిగితే యాక్షన్ సన్నివేశాలు, కథలోని కీలక మలుపులు, ఇంటర్వెల్ ట్విస్ట్, హీరో హీరోయిన్ల నటన వంటి అంశాలు మెప్పిస్తాయి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 
Like us on Facebook