సమీక్ష : పాగల్ – రొటీన్ రొమాంటిక్ డ్రామా

Paagal movie review

విడుదల తేదీ : ఆగస్టు 14, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

తారాగణం: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘ లేఖ, మురళీ శర్మ

దర్శకత్వం:  నరేష్ కుప్పిలి

సంగీతం : రాధన్

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

నిర్మాత : బెక్కెం వేణుగోపాల్

మరి గత రెండు వారాల నుంచి మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో మన టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర సినిమాలే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అలా ఈ వారం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “పాగల్” రిలీజ్ కి వచ్చింది. మంచి బజ్ లోనే వచ్చిన ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టయితే ప్రేమ్(విశ్వక్ సేన్) తన తల్లి(భూమిక) తో తన చిన్న వయసులో ఎంతో ప్రేమతో కూడా అనుబంధం ఏర్పర్చుకుంటాడు. తన తల్లి అంటే ఎంతో ఇష్టం ప్రేమ ఉన్నా దురదృష్టవశాత్తు ఆమె కాన్సర్ తో చనిపోతుంది. కానీ తన తల్లి చెప్పిన మాట మాత్రం తన మనసులోనే ఉంటుంది. ఎవరినైనా మనం ప్రేమిస్తే వాళ్ళు మనని తిరిగి ప్రేమిస్తారు అని తన తల్లి చెప్పడంతో మళ్ళీ తన అమ్మలా ప్రేమించే తోడు కోసం వెతుకుతాడు. ఆ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిలకి ప్రపోజ్ చెయ్యడం రిజక్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ లాస్ట్ కి తీరా(నివేతా పెత్తురాజ్) ప్రేమ్ ప్రేమని ఓకే చేస్తుంది. మరి వీరి ప్రయాణం ఎంత వరకు వెళ్తుంది? ప్రేమ్ కి మళ్ళీ తన తల్లి దగ్గర లాంటి ప్రేమ తీరా నుంచి దొరుకుతుందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటగా మాస్ కా దాస్ విశ్వక్ కోసమే మాట్లాడినట్టయితే తన గత చిత్రాలతో విశ్వక్ లో మరింత మెరుగైన నటన కనిపిస్తుంది. సినిమా అంతా చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జిటిక్ గా సినిమా అంతా సేన్ ఒక్కడై నడిపిస్తాడు. అలాగే కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ ని కూడా చాలా ఈజ్ గా చేసి చూపించాడు.

అలాగే నివేతా తో కెమిస్ట్రీ కానీ ప్రపోజ్ చేసే సన్నివేశాల్లో కానీ మంచి కెమిస్ట్రీ, ఫన్ వే లో బాగా కనిపించాడు. అలాగే నివేతా తన రోల్ మేరకు డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది. మెయిన్ లీడ్ మధ్య ఎమోషన్స్, లవ్ సీన్స్ కూడా తన పాత్ర మేర నటనను కనబరిచింది.

ఇంకా నటుడు మురళి శర్మ, భూమికలు కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. వీటితో పాటుగా సినిమాలో రామ్ ప్రసాద్, మహేష్ లపై వచ్చే కామెడీ ఎపిసోడ్స్ అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా డీసెంట్ గా అనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

జెనరల్ గా ముందు అంతా ఒక రొమాంటిక్ కామెడీ యాంగిల్ లో నడుస్తున్న ట్రాక్ కి బలమైన ఎమోషన్ ని జోడించి మెప్పించడం అనేది కష్టమైన పని అది ఈ చిత్రంలో మిస్ ఫైర్ అయ్యింది. వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చెయ్యకపోవడం మూలాన మెయిన్ ఎమోషన్స్ కథలోని సోల్ దెబ్బ తిన్నట్టు అనిపిస్తుంది.

అలాగే నివేతా, విశ్వక్ లవ్ స్టోరీ కి సరైన కథనం ఉన్నట్టు అనిపించదు. అలాగే కొన్ని ఎమోషన్స్ సన్నివేశానికి సంబంధం లేదా ప్రాధాన్యత లేకుండా పెట్టించినట్టు అనిపిస్తుంది ఇదో బలహీన అంశం. అలాగే ఓ తల్లి, కొడుకు సన్నివేశాలు బాగున్నా ఆ తరహా ఓ తండ్రి కూతురు సన్నివేశాలు అనిపించవు వాటిని ఇంకా బాగా ఎలివేట్ చేస్తే బాగున్ను.

అలాగే సెకండాఫ్ లో చాలా సీన్స్ లాజిక్స్ లేకపోవడం కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. వాటి మూలాన కాస్త డల్ గా అనిపిస్తుంది.. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో చూస్తే సెకండాఫ్ అంత ఇంపాక్ట్ కలిగినట్టుగా అనిపించదు..

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి. అలాగే టెక్నీకల్ టీం లో రాధన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అలాగే మణికందన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా మంచి విజువల్స్ తో కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు నరేష్ కుప్పిలి విషయానికి వస్తే..

నరేష్ మంచి ఎమోషనల్ అండ్ లవ్ డ్రామా కథను ఎంచుకున్నాడు కానీ దానిని సమర్ధవంతంగా హ్యాండిల్ చెయ్యడంలో తడబడ్డాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేసిన నరేష్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ తో కలిపి ఎమోషన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. దానిని కానీ బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఖచ్చితంగా పాగల్ కి ఇంకా బెటర్ అవుట్ పుట్ ఇచ్చి ఉండేవాడు.

 

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘పాగల్’ ఫస్ట్ హాఫ్ వరకు బాగా ఆకట్టుకుంటాడు అలాగే విశ్వక్ నుంచి కొత్త యాంగిల్, తన నటన అంతా సాలిడ్ అండ్ ప్రామిసింగ్ గా ఉంటుంది. అలాగే నివేతా సహా ఇతర నటీనటులు కూడా మెప్పిస్తారు. కానీ సరైన విధంగా ఎమోషన్స్ ని జోడించకపోవడం డైరెక్టర్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా ఉండకపోవడం ఆడియెన్స్ కి అంత ఎంగేజింగ్ గా అనిపించకపోవచ్చు. కానీ విశ్వక్ సేన్ కోసం కొన్ని నవ్వులు, అక్కడక్కడా ఎమోషన్స్ కోసం అయితే ఈ పాగల్ ని ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :