సమీక్ష : పడి పడి లేచె మనసు – పర్వాలేదనిపించిన రొమాంటిక్ డ్రామా

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : శర్వానంద్ , సాయి పల్లవి , మురళీ శర్మ , సునీల్

దర్శకత్వం : హను రాఘవపూడి

నిర్మాత : చెరుకూరి సుధాకర్

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

హను రాఘవపూడి దర్శకత్వంలో యువ హీరో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ ఈ రోజు విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

సూర్య (శర్వానంద్) ,వైశాలి (సాయి పల్లవి ) ని తొలిచూపులోనే ఆమె ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో వైశాలి కోసం శర్వా చేసే పనుల వల్ల వైశాలి కూడా సూర్య ను ప్రేమిస్తుంది. ఇక ఇద్దరు ప్రేమలో ఉండగా వైశాలి పెళ్లి చేసుకుందాం అంటుంది. అయితే పెళ్లి మీద నమ్మకం లేని సూర్యపెళ్లి ఇష్టం లేదని ఒకరి మీద ఒకరికి చచ్చేఅంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకుందాం అనడంతో దానికి వైశాలి, సూర్య కు ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటి ? మళ్ళీ సూర్య , వైశాలి కలిసారా ? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి సూర్య , వైశాలి పాత్రలు. ఇక ఆ పాత్రల్లో నటించిన శర్వానంద్ , సాయి పల్లవి ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముందు నుంచి చెపుతున్నట్లు సినిమాలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. సూర్య పాత్ర లో నటించిన శర్వా చాలా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ , రొమాంటిక్ , కామెడీ సన్నివేశాలను ఈజీ గా చేస్తూ మరోసారి ట్యాలెంటెడ్ హీరోగా నిరూపించుకున్నాడు. ఇక సాయి పల్లవి కూడా నటన విషయంలో శర్వా కు గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా కథ అంత వీరిద్దరూ చుట్టూ తిరగడంతో అందురు నటీనటులు వున్నా తెర మీద వీరిద్దరూ మాత్రమే ప్రత్యేకంగా అనిపిస్తారు.

ఇక ట్యాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ హాఫ్ లో తన ప్రతిభ చూపెట్టాడు. ముఖ్యంగా కలకత్తా కల్చర్ ను బాగా చూపెట్టాడు. అలాగే విజువల్స్ మరియు సంగీతం కూడా చిత్రానికి హైలైట్ అయ్యాయి. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన మురళీ శర్మ , సునీల్ , ప్రియదర్శి తమ పాత్రలకు నాయ్యం చేశారు. వెన్నల కిషోర్ వుంది కాసేపేయైన తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

సింపుల్ ప్రేమ కథ కు మెమరీ లాస్ అనే అంశాన్ని జోడించి దాన్ని సంతృప్తిగా కన్వే చేయలేకపోయాడు హను. ఫస్ట్ హాఫ్ ను హైలైట్ చేసి సెకండ్ హాఫ్ ను బోరింగ్ మార్చేశాడు. ఇక ఇంటర్వల్ ముందు వచ్చే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ సిల్లీ గా అనిపిస్తుంది. అప్పడిదాకా హీరోయిన్ ను పీకలదాకా ప్రేమించిన హీరో పెళ్లి చేసుకుందాం అనే సరికి బ్రేక్ చెప్పడం లాంటి విషయాలు అంత కన్విన్స్ గా అనిపించవు.

సెకండ్ హాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకుడిని నిరాశకు గురి చేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మరి సినిమాటిక్ గా ఉండడం ఎంగేజింగ్ గా లేని నరేషన్ సినిమాపై ప్రభావం చూపించింది. ఫస్ట్ హాఫ్ లోలాగే సెకండ్ హాఫ్ ను ఆసక్తికరంగా చూపించి ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక వర్గం :

హను రాఘవపూడి ఒక సున్నితమైన ప్రేమ కథను తీసుకుని దాన్ని తెర మీద తీసుకరావడంలో అక్కడక్కడ తడబడ్డాడు. స్టోరీ వైస్ గా కొత్తగా ఏమిలేకున్నా ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా చూపెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ విషయంలో మ్యాజిక్ చేయలేకపోయాడు.

ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు హైలైట్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలు ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫై ఇంకాస్త శ్రద్దా పెడితే బాగుండేది అనిపిస్తుంది. సినిమా మరీ లెన్తీ గా అనిపిస్తుంది. జయకృష్ణ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కోలకతా లోని లొకేషన్స్ చాలా బాగా చూపెట్టాడు. ఇక చెరుకూరి సుధాకర్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

తీర్పు :

ఒక లవ్ స్టోరీ కి డిఫరెంట్ కాన్సెప్ట్ ను జోడించి హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ పడి పడి లేచె మనసు లో ఫస్ట్ హఫ్ట్ అలాగే శర్వా ,సాయి పల్లవి ల నటన హైలైట్ అవ్వగా గా బోరింగ్ సెకండ్ హాఫ్ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఓవరాల్ గా ఈచిత్రం యూత్ కు నచ్చుతుంది కానీ మిగితా వర్గాల వారికి అంతగా కనక్ట్ అవ్వదు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :