సమీక్ష : ‘‘రాధేశ్యామ్’’ – స్లోగా సాగే విజువల్ లవ్ డ్రామా!

సమీక్ష : ‘‘రాధేశ్యామ్’’ – స్లోగా సాగే విజువల్ లవ్ డ్రామా!

Published on Mar 12, 2022 10:15 AM IST
Radhe Shyam Review In Telugu

విడుదల తేదీ : మార్చి 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, జగపతిబాబు, సత్యరాజ్ ప్రియదర్శి తదితరులు..

దర్శకత్వం : కె రాధాకృష్ణ కుమార్

నిర్మాత: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

సంగీత దర్శకుడు: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, థమన్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

‘యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘రాధేశ్యామ్’. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

విక్రమాదిత్య (ప్రభాస్) ఫేమస్‌ పామిస్ట్‌. ఇండియాకి ఎమర్జన్సీ వస్తోందని ముందే చెప్పడంతో.. అతను ఇండియా వదిలి ఇటలీ వెళ్ళిపోవాల్సి వస్తోంది. ఇక తన జీవితంలో ప్రేమ, పెళ్లి లేవని నమ్మే విక్రమాదిత్య కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి విక్రమాదిత్య (ప్రభాస్) ఏమి చేశాడు ? ఇంతకీ ప్రేరణకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి ? అలాగే వీరి ప్రేమలో వచ్చిన సమస్య ఏమిటి ? చివరకు విక్రమాదిత్య – ప్రేరణ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? ఇక ఈ మధ్యలో పరమహంస (కృష్ణం రాజు) పాత్ర ఏమిటి ? మొత్తం ఈ ప్రయాణంలో విక్రమాదిత్య ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాడు ? చివరకి విక్రమాదిత్య – ప్రేరణ ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ భారీ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

అత్యంత భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్ తో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

ఇక కథానాయకగా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ పూజా హెగ్డే పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ మరియు ప్రభాస్ క్యారెక్టర్ లోని షేడ్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ఇక సినిమాలో కీలక మైన పాత్రలో నటించిన కృష్ణంరాజు తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు జగపతిబాబు, సచిన్ ఖేదేకర్, భాగ్యశ్రీ తమ నటనతో ఆకట్టుకున్నారు. అదేవిదంగా క్లైమాక్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

భారీ అంచనాలతో వచ్చిన ఈ హై ఎమోషనల్ ఎంటర్ టైనర్ విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా సినిమాలో ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్ బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని సన్నివేశాల సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దర్శకుడు సినిమాను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బాగా నెమ్మదిగా నడిపారు.

అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. ‘బి.సి’ సెంటర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది. ఇక కొన్ని సీన్స్ లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లు లేవు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ చాలా బోర్ గా లాజిక్ లేకుండా సాగాయి.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

 

తీర్పు :

 

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా వచ్చిన ఈ భారీ ఎమోషనల్ ఎంట‌ర్‌టైన‌ర్ లో మెయిన్ కథాంశం, పాత్రల చిత్రీకరణ, ప్రభాస్ – పూజాల మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ లోని స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు బలమైన ప్రభాస్ స్క్రీన్ ప్రేజన్సీ ఆకట్టుకున్నాయి. అయితే, స్లోగా సాగే సీన్స్ తో అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తానికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు