సమీక్ష : నీకు నాకు డాష్ డాష్ – మీ సమయాన్ని డాష్ చేసే చిత్రం

విడుదల తేది : 13 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.25/5
దర్శకుడు : తేజ
నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
సంగిత డైరెక్టర్ : యశ్వంత్ నాగ్
తారాగణం : ప్రిన్స్ ,నందిత

“నువ్వు నేను” మరియు “జయం” వంటి చిత్రాలతో తనకంటూ ఒక శైలితో పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దర్శకుడు తేజ తన నూతన చిత్రం “నీకు నాకు డాష్ డాష్” చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నూతన నటీనటులను పరిచయం చేస్తూ చేసిన ఈ చిత్రానికి యశ్వంత్ నాగ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఈ చిత్రం మొత్తం మద్యం మాఫియా చుట్టూ తిరుగుతుంది. శివ(ప్రిన్సు) ఒక నిజాయితి గల ముక్కుసూటి కుర్రాడు ఇతను తన స్నేహితుల సంక్షేమం గురించి పట్టించుకుంటూ ఉంటాడు. అతను కచ్చితంగా అవినీతి మద్యం సిండికేట్ లో పని చెయ్యాల్సి వస్తుంది. ఈ సిండికేట్ ని బాపినీడు మరియు “చిట్టి తల్లి”(తీర్థ) నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ పని చేస్తుండగా అక్కడే పని చేస్తున్న గాయత్రీ(నందిత)తో ప్రేమలో పడతాడు. ఆ మద్యం మాఫియాలో ఒక రహస్య ప్రేమకథను వీరు నడుపుతారు.

ఇదిలా ఉండగా శివ మూలంగా ఒకానొక సహోద్యోగి కుటుంబం నష్టపోతుంది. అ కుటుంబానికి సహాయపడేందుకు శివ తన ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ గురించి తెలిసన బాపినీడు శివ వెంటపడతాడు. తన ప్రయత్నాలు ఫలించాయా? శివ ఆ కుటుంభానికి సహాయం చేసాడా లేదా? బాపినీడు నుండి తప్పించుకున్నడా? అనేది మిగిలిన కథ.

ప్లస్ :

ప్రిన్సు చూడటానికి బాగున్నాడు అతనిలో చారం ఉంది, తను నిజం చిత్రం మహేష్ బాబుని అనుకరించడం తగ్గించుంటే బాగుండేది నటన లో పరవాలేదనిపించాడు. నందిత చిత్రానికి బలం చేకూర్చింది అందంగా లేనప్పటికీ ఆ పాత్రకు సరిగ్గా సరిపాయింది. తన అద్బుతమయిన ప్రదర్శన ఇచ్చింది. బాపినీడు పాత్రలో నటించిన నటుడు చాలా బాగా చేసాడు. వేణు చాలా బాగా చేశాడు పరుచూరి వెంకటేశ్వరా రావు గారు మంచి ప్రదర్శన కనబరిచారు సుమన్ శెట్టి అక్కడ నవ్వించడానికి ప్రయత్నించారు. చిత్ర కథ చాలా ఆసక్తి కరంగా ఉంది మొదటి అర్ధ భాగం పరవాలేదనిపిస్తుంది.

మైనస్ :

చిత్రం ముడి పదార్థం లాగా ఉంటుంది సన్నివేశాలు చాల అసభ్యకరంగా ఉంటాయి. తీర్థ పాత్రా చాలా చీప్ గా ఉంటుంది. రెండవ అర్ధ భాగం లో తేజ ఎం చెప్పాలనుకున్నాడో చెప్పలేకపోయాడు. చిత్రం ఒక అంతులేని చసింగ్ కథలా తయారవుతుంది. చిత్రం లో చాలా తాపులు ఉన్నాయి.చిత్ర కథ దాదాపుగా “షాపింగ్ మాల్” లా ఉంటుంది. ఆ చిత్రం చుసిన వారికి ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది. తేజ ఇంకా “జయం” చిత్రాన్నే అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చిత్రం లో మలుపులు ఇట్టే పట్టేయచ్చు పెద్దగా ఆసక్తిని సృష్టించదు.చిత్రం లో ప్రేమ కథను సరిగ్గా చూపించలేకపోయారు. చిత్రం లో ప్రధాన పాత్రల మధ్య సఖ్యత సరిగ్గా కుదిరినట్టు అనిపించదు. రొమాంటిక్ సన్నివేశాలు ఒత్తిడి మీద చేసినట్టు అనిపిస్తుంది. చిత్రాని ఇరవై నిమిశాలయిన తగ్గించి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం:

చిత్రానికి నేఫధ్య సంగీతం పెద్ద మైనస్ అయ్యింది రెడ్ ఎపిక్ కెమరా వాడినా కూడా అక్కడ అక్కడ తప్ప మిగిలిన చోట్ల మాములుగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా బాగా చూపించారు ప్రదేశాలను. సంభాషణలు పరవాలేదు కాని మాస్ ఫీల్ ఉంటుంది. ఎడిటింగ్ ఇంకా బాగా ఉండాల్సింది రెండవ అర్ధ భాగం మీద తేజ మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఈ చిత్రం కూడా తన పాత చిత్రాలను చూసినట్టే ఉంటుంది.

తీర్పు:

నందిత ప్రదర్శన మరియు కొన్ని మంచి సన్నివేశాలను పక్కన పెడితే “నీకు నాకు దాస్ దశ ” చిత్రం లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవు. రెండవ అర్ధ భాగం బాగోలేకపోవటం చిత్రం లో అసభ్య కరమయిన సంభాషణలతో నడిపించడం చిత్రానికి మంచి చేయ్యబోదు. తేజ తన పాత చిత్రాల లానే ఈ చిత్రం లో కూడా కథనాన్ని నడిపించాడు. మీ సమయాన్ని “డాష్” చేసుకోవాలనుకుంటే ఈ చిత్రాన్ని ప్రయత్నించండి.

123తెలుగు.కాం రేటింగ్ : 2.25/5

Clicke Here For ‘Neeku Naaku Dash Dash’ English Review

అనువాదం – రవి

సంబంధిత సమాచారం :