Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష – 2 : కెమెరామెన్ గంగతో రాంబాబు – రాజకీయ నాయకుల మీద తిరగబడే రాంబాబు

విడుదల తేదీ: 18 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : పూరి జగన్నాధ్
నిర్మాత : డివివి దానయ్య
సంగీతం: మణి శర్మ
నటీనటులు : పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్

రాష్ట్రంలో అధికారికంగా చాలా పండుగలు వస్తాయి పవన్ కళ్యాణ్ అభిమానులకి అనధికారికంగా వచ్చే పండుగ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల. అపజయాల్లో ఉన్నప్పుడే పవర్ స్టార్ చిత్రం విడుదల పండగ అంటే, ఒక బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత ఒక సినిమా వస్తుంది అంటే, అందులోనూ ఎప్పటి నుండో వేచి చూస్తున్న రేర్ కాంబినేషన్లో చిత్రం అయితే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అలాంటి భారీ అంచనాల మధ్యన “బద్రి” చిత్రం తరువాత రేర్ కాంబినేషన్ పూరి-పవన్ ల కలయికలో ఈరోజు ప్రపంచమంతటా విడుదలయిన చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.తమన్నా ఈ చిత్రంలో పవన్ సరసన నటించారు . ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

కథ:

న్యూస్ పేపర్లో మరియు న్యూస్ చానల్స్ లో వచ్చే వార్తలకు స్పందించి న్యాయం వారికి జరిగేలా చేసే వ్యక్తిత్వం గల ఒక మెకానిక్ రాంబాబు(పవన్ కళ్యాణ్) టీవీ ఛానల్ లో కెమెరా మెన్ గా పని చేసే గంగ(తమన్నా) రాంబాబుని చూసి, తన వ్యక్తిత్వం నచ్చి మీడియాలోకి వచ్చేలా ప్రేరేపిస్తుంది. మీడియాలోకి వచ్చిన రాంబాబు అన్యాయాలను ఎదురిస్తూ తప్పు జరిగిన చోట న్యాయంజరిగేలా చేస్తుంటాడు. ఇదిలా ఉండగా జవహర్ నాయుడు (కోట శ్రీనివాస రావు) ప్రతి పక్ష నాయకుడిగా ఉంటారు తాను కోల్పోయిన ముఖ్యమంత్రి పదవిని తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలో అడ్డు పడిన దశరథ రాములు(సూర్య) అనే జర్నలిస్ట్ ని తన కొడుకు అయిన రానా నాయుడు(ప్రకాష్ రాజ్) చేత చంపిస్తాడు. ఈ విషయంలో కోపం వచ్చిన రాంబాబు రానానాయుడుని పోలీస్ లకు పట్టిస్తాడు. జైలు నుండి వచ్చిన రానా నాయుడుని తన వారసుడిగా ప్రకటించి తరువాత ముఖ్యమంత్రిని చెయ్యాలని జవహర్ నాయుడు అనుకుంటాడు. ఈ విషయమై కక్ష పెంచుకున్న రానా రాంబాబుతో గొడవ పడతాడు. ఈ గొడవలో రాంబాబు రానా నాయుడుని ముఖ్యమంత్రి కానివ్వను అని ఛాలెంజ్ చేస్తాడు. రానా నాయుడు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి రాంబాబు ఏం చేశాడు? స్మిత(గబ్రియేలబెర్తంతే) ఎవరు? ఆ పాత్రకి రాంబాబుకి ఉన్న సంబంధం ఏంటి? రాంబాబు ఒక వ్యక్తి నుండి శక్తిలా ఎలా మారాడు? అన్నదే మిగిలిన కథాంశం.

ప్లస్ :

మొదట చెప్పినట్టు ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పవన్ కళ్యాణ్. సినిమాని తన భుజాల మీద మోసాడు అనే చెప్పాలి. రాంబాబు పాత్రలో పూర్తి పవర్ నింపి జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి అనేలా చేశాడు.డైలాగు చెప్పడంలో కాని ఫైట్స్ లో కాని తనదయిన శైలితో సగటు ప్రేక్షకుడికి బాగా చేరువయ్యారు. తమన్నా తన నటనతో పవన్పెర్ఫార్మెన్స్ కి మంచి సప్పోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా పవన్ మరియు తమన్నా మధ్యలో వచ్చే ట్రాక్ చాలా బాగా వచ్చింది. కోట శ్రీనివాస్ రావు తన పాత్రతో అలరించగా ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగే విలన్ గా బాగా చేశారు. అలీ,బ్రహ్మానందం ఎప్పటిలానే పూరి జగన్నాథ్ చిత్రాలలో వారి శైలి కామేడితో అలరించారు.ఎం ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వారి పాత్రల మేరకు బాగా చేశారు. గబ్రియేల, నాజర్, తనికెళ్ళ భరణిపర్వాలేదనిపించారు. పూరి రాసిన డైలాగ్స్ పవన్ నోట వింటుంటే అవి మరో స్థాయికి వెళ్ళాయి. పాటల చిత్రీకరణ ఫైట్లు చాలా బాగున్నాయి. పవన్ మరియు బ్రహ్మానందం మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. చివర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ అలరించేవే కాకుండా ఆలోచింపచేసేవి కూడా.

మైనస్:

మొదటి అర్ధభాగం మంచి వేగం మీద ఉన్న కథ ఇంటర్వెల్ అవ్వగానే నెమ్మదిస్తుంది. పవన్ మరియు అలీ మధ్యన సన్నివేశాలు అంతగా హాస్యాన్ని పండించలేదు. పూరి జగన్నాథ్ గత చిత్రాలతో పోలిస్తే డైలాగ్స్ కాస్త తగ్గింది అనే చెప్పాలి. చిత్రంలో ప్రధాన అంశాన్ని మొదటి అర్ధ భాగంలోనే చెప్పేయడంతో రెండవ అర్ధ భాగం చాలా సేపటి వరకు నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్ లో ఉపయోగించిన గ్రాఫిక్స్ కాస్త బాగుండాల్సింది. గంగ పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే టైటిల్ తగ్గ సినిమా అయ్యుండేది.

సాంకేతిక విభాగం:

పూరి జగన్నాథ్ కథ మీద కన్నా కథనం మీద ఎక్కువగా పని చేసినట్టు తెలుస్తుంది కథనంలో వేగం ఉంటుంది రెండవ అర్ధభాగం కూడా కాస్త వేంగంగా నడిపి ఉంటె బాగుండేది కాని అయన రాసుకున్న క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతం అని చెప్పాలి. ఇంక డైలాగ్స్ విషయానికి వస్తే తనదయిన శైలిలో ఉన్న డైలాగ్స్ తక్కువనే చెప్పాలి కాని ఉన్నంత వరకు అన్ని డైలాగ్స్ క్యాచిగా ఉండటమే కాకుండా కొన్ని ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. పూరి మాటలకుపదును ఎక్కువ అన్న విషయాన్నీ వీటి ద్వారా మరోసారి తెలిపారు. దర్శకత్వం విషయంలోవిజయం సాదించారని చెప్పవచ్చు. శ్యాం. కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ అభినయాన్ని తమన్నా అందాలను చాలా బాగా చూపెట్టారు. మణిశర్మ అందించిన పాటలు వినడానికే కాకుండా చూడటానికి కూడా బాగున్నాయి. నేపధ్య సంగీతంలో తన మార్క్ మ్యూజిక్ తో సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఎస్ ఆర్ శేఖర్ అందించిన ఎడిటింగ్ పరవాలేదు.

తీర్పు :

పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోసిన చిత్రం ఇది. సమాజానికి ఎప్పుడు ఏదో చెప్పాలని అనుకునే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ద్వారం మంచి సందేశాన్ని ఇవ్వటానికి ప్రయత్నించారు. పూరి శైలి డైలాగ్స్ మరియు అయన దర్శకత్వం చిత్రానికి బలం. రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదించడం, కొన్ని అనవసర సన్నివేశాలు ఇబ్బంది పెట్టినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ ముందు ఇవేవి కనపడవు. ఈ చిత్రం గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే “రాంబాబు మీడియాకి ఎలా ఉండాలో నేర్పాడు, ప్రజలకి ఎలా ఉండాలో చెప్పాడు, రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదో చూపాడు “.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

Click Here For ‘CMGR’ Telugu Review

Click Here For ‘Box Office Babu rao Puri Jagannadh interview’

– రv


సంబంధిత సమాచారం :