సమీక్ష : “సమ్మతమే” – అక్కడక్కడా ఆకట్టుకునే లవ్ డ్రామా

సమీక్ష : “సమ్మతమే” – అక్కడక్కడా ఆకట్టుకునే లవ్ డ్రామా

Published on Jun 25, 2022 3:03 AM IST
Chor Bazar Movie Review

విడుదల తేదీ : జూన్ 24, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు

దర్శకత్వం : గోపీనాథ్ రెడ్డి

నిర్మాత: కంకణాల ప్రవీణ

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం

ఎడిటర్: విల్పవ్ నైషదం


టాలీవుడ్ లేటెస్ట్ షైనింగ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సమ్మతమే” డీసెంట్ బజ్ నడుమ ఈరోజు ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆడియెన్స్ ని ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే.. కృష్ణ(కిరణ్ అబ్బవరం) తన చిన్నప్పుడు నుంచి తన తల్లి లాగ సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయినే పెళ్లంటూ చేసుకుంటే చేసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యి ఉండిపోతాడు. అలాగే పెరిగిన తాను శాన్వి(చాందిని చౌదరి) అనే అమ్మాయి చాలా ఫ్రీగా, మోడ్రన్ గా ఉండే అమ్మాయిని కలుసుకుంటాడు. ఆమెతోనే ప్రేమలో పడతాడు. మరి ఇలాంటి ఈ ఇద్దరు కలిసి ఒక జంటగా ఉండగలుగుతారా? వీరి లైఫ్ లో వచ్చే ట్విస్ట్ ఏమిటి? చివరికి వీరిది ఒక హ్యాపీ జంట అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మొదటగా మెప్పించేది ఈ సినిమా థీమ్ అనే చెప్పాలి. హీరో హీరోయిన్ మధ్య ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం అనేది ఒకింత ఆసక్తిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు కూడా కొన్ని అంశాలు యూత్ కి కనెక్ట్ అయ్యేలా అలాగే ఆలోచించేలా అనిపిస్తాయి. ఈ అంశం మాత్రం ఆకట్టుకుంటుంది.

అలాగే మరో మెయిన్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే ఇక అది మెయిన్ లీడ్ పెర్ఫామెన్స్ లు అని చెప్పొచ్చు. హీరో కిరణ్ అబ్బవరం నుంచి తన గత చిత్రాలతో పోలిస్తే మంచి రోల్ లో వచ్చింది. చిన్న చిన్న భావోద్వేగాలతో పెద్ద ఎమోషన్స్ ని మోసే యువకుడిగా తాను పలికించిన హావభావాలు, తన డైలాగ్ డెలివరీ మరియు లుక్స్ తో డెఫినెట్ గా ఆకట్టుకుంటాడు.

అలాగే హీరోయిన్ చాందిని తో కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక హీరోయిన్ చాందిని చౌదరి విషయానికి వస్తే. తన కెరీర్ లో ఈ సినిమా మంచి ప్లస్ అని చెప్పాలి. తనకి రాసిన రోల్ కి అయితే ఆమె మాత్రం కంప్లీట్ గా జస్టిస్ చేసింది. లుక్స్ పరంగా గాని నటన పరంగా కానీ బెస్ట్ వర్క్ ని తాను అందించే ప్రయత్నం చేసింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కొంతమేర కొన్ని పాయింట్స్ కథనం ఆకట్టుకున్నా ఓవరాల్ గా మాత్రం ఆడియెన్స్ కి కంప్లీట్ అనుభూతి కలుగకపోవచ్చు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో కథనం మెయిన్ పాయింట్ ని తీసుకెళ్లే విధానం ఆకట్టుకునేలా అనిపించదు. దీనితో ఒకింత బోర్ గా అనిపించొచ్చు.

అలాగే సినిమాకి కావాల్సిన కీలక ఎమోషన్స్ హైలైట్ అవ్వాల్సిన సమయంలో అవి అంత బాగా ఎలివేట్ అయ్యినట్టు అనిపించదు దీనితో మరింత సోసో గా స్క్రీన్ ప్లే అనిపిస్తుంది.

ఇంకో కనెక్ట్ కాని అంశం ఏమిటంటే ఇద్దరు వేర్వేరు ఆలోచనలు కలిగి ఉండే హీరో హీరోయిన్ లు ఎలా ఒకటవుతారు అనేది సరిగ్గా డీల్ చెయ్యలేనట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాకి ఎంతో కీలకమైన క్లైమాక్స్ కూడా సిల్లీ రీజన్స్ తో అంతగా ఆకట్టుకునే విధంగా అనిపించదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమాలో లొకేషన్స్ సెటప్ అంతా క్లీన్ అండ్ నీట్ గా కనిపిస్తాయి. ఇక టెక్నీకల్ టీం లో అయితే సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి మాసం వర్క్ చాలా బాగుంది, ప్లెజెంట్ విజువల్స్ ని తాను చూపించాడు. అలాగే శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం, బాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక విప్లవ్ ఎడిటింగ్ అయితే సెకండాఫ్ లో గ్రిప్పింగ్ గా చెయ్యాల్సింది.

ఫైనల్ గా దర్శకుడు గోపినాథ్ రెడ్డి విషయానికి వస్తే ఓవరాల్ గా తన వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. తాను తీసుకున్న లైన్ బాగానే ఉన్నా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే హ్యాండిల్ చేశారు కానీ సెకండాఫ్ అసలు సమస్య మొదలవుతుంది. ఇందులో కూడా పర్ఫెక్ట్ నరేషన్ ఇచ్చి ఉంటే మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. పోనీ క్లైమాక్స్ లో అయినా సరైన ఎండింగ్ ఇచ్చి ఉన్నా బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా ఉన్నట్టయితే ఈ “సమ్మతమే” చిత్రం లో హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం మరియు చాందిని చౌదరిలు ప్రామిసింగ్ అండ్ సిన్సియర్ పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటాయి. అలాగే ఫస్టాఫ్ వరకు కూడా ఓకే కానీ సెకండాఫ్ నుంచే అసలు సమస్య మొదలవుతుంది, సరైన కథనం ఆడియెన్స్ ని మెప్పించే స్క్రీన్ ప్లే బాగా మిస్సవుతుంది. పైగా క్లైమాక్స్ కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. కానీ సినిమాలో కాన్సెప్ట్ మరియు కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషన్స్ కోసం మాత్రం స్ట్రిక్ట్ ఒకసారి ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు