పాటల సమీక్షలు : సరిలేరు నీకెవ్వరు – ఆహ్లాదం కలిగించే పక్కా కమర్షియల్ ఆల్బమ్

పాటల సమీక్షలు : సరిలేరు నీకెవ్వరు – ఆహ్లాదం కలిగించే పక్కా కమర్షియల్ ఆల్బమ్

Published on Jan 6, 2020 2:20 PM IST

ఈ సంక్రాంతికి వస్తున్న మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు లోని ఐదు పాటలు విడుదల కావడం జరిగింది. రాక్ స్టార్ దేవీశ్రీ-మహేష్ లది మ్యూజికల్ హిట్ కాంబినేషన్ గా పేరున్న నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు కొరకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…

1. పాట : సరిలేరు నీకెవ్వరూ.. Sarileru Neekevvaru Anthem

ఈ మూవీలోని మొదటి సాంగ్ టైటిల్ సాంగ్ ‘సరిలేరు నీకెవ్వరు…’. సరిలేరు నీకెవ్వరు యాంథం పేరుతో విడుదలైన ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సైనికుల గొప్పతనాన్ని త్యాగనిరతిని, కష్టాలను తెలిపేలా సాగిన సరిలేరు నీకెవ్వరు.. సాంగ్ విషయంలో దేవిశ్రీ ప్రసంశలు అందుకుంటున్నారు. బావోద్వేగంతో కూడిన జవానుల వీరోచిత గాధను తెలియజేసేలా దేవిశ్రీ స్వరాలు అందించారు. ఈ పాటకు ఆయనే స్వయంగా సాహిత్యం రాయడం విశేషం.

 
2. పాట :సూర్యుడివో.. చంద్రుడివో..

సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని రెండవ సాంగ్ ‘సూర్యుడివో..చంద్రుడివో’. దేవిశ్రీ మెలోడియస్ గా ఈ పాటను స్వరపరచగా సింగర్ బి ప్రాక్ ఆహ్లాదంగా పాడారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పాటకు అదనపు ఆకర్షణ అయ్యింది. పాటను చూస్తుంటే విజయ శాంతి కుటుంబానికి అండగా వచ్చిన మహేష్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ పాట వస్తుందనిపిస్తుంది.

3. పాట : హి ఈజ్ సో క్యూట్.. He's Soo Cute
 
సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మూడవ సాంగ్ హి ఈజ్ సో క్యూట్. రష్మిక తన ఫ్యామిలీ తో కలిసి మహేష్ ని ఆటపట్టించే సంధర్భంలో వచ్చే ఈ సాంగ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రచయిత శ్రీమణి ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ మధు ప్రియ ఆహ్లాదంగా పాడారు.

Mind Block4. పాట : మైండ్ బ్లాక్..
 
సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని నాలుగవ సాంగ్ ‘మైండ్ బ్లాక్..’మాస్ బీట్స్ కి పెట్టింది పేరైన దేవిశ్రీ అందించిన మైండ్ బ్లాక్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సంక్రాంతి కి వెండి తెరపై ఈ సాంగ్ పటాసులా పేలడం ఖాయంగా కనిపిస్తుంది. బ్లేజ్ మరియు రనీనా రెడ్డి పాడగా శ్రీమణి, దేవీశ్రీ సాహిత్యం అందించారు.

5. పాట : డాంగ్.. డాంగ్.. Dang Dang
 
ఈ చిత్రంలోని చివరి సాంగ్ డాంగ్ డాంగ్ . తమన్నా మరియు మహేష్ మధ్య వచ్చే ఈ స్పెషల్ ఐటెం నంబర్ లో మహేష్ గ్రేస్ స్టెప్స్ తో ఇరగదీశారు. తమన్నా పార్టీ ఇస్తా అంటూ వేసిన హాట్ స్టెప్స్ కిక్కెస్తున్నాయి. ఐటమ్స్ సాంగ్స్ కి ట్రేడ్ మార్క్ అయిన దేవిశ్రీ అందించిన ట్యూన్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, నాకాష్ ఆజిక్, లవిత లోబో పాటకు తగ్గట్టు మంచి టెంపోలో పాడారు.

 

తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ స్లోగా యూత్ కి కనెక్ట్ అవుతున్నాయి. మొదట్లో కొంత మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ వింటున్న కొద్దీ.. ఈ సాంగ్స్ ఆసక్తిని పెంచుతూ ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ఐదు పాటలలో ముఖ్యంగా సూర్యుడివో.. చంద్రుడివో.., హి ఈజ్ సో క్యూట్, మైండ్ బ్లాక్ సాంగ్స్ అలరించేవిగా ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే దేవీశ్రీ సరిలేరు నీకెవ్వరు ఆల్బమ్ తో మరోమారు తన స్టామినా నిరూపించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు