సమీక్ష : శాకుంతలం – స్లోగా సాగే బోరింగ్ విజువల్ డ్రామా!

సమీక్ష : శాకుంతలం – స్లోగా సాగే బోరింగ్ విజువల్ డ్రామా!

Published on Apr 15, 2023 3:04 AM IST
Shaakuntalam Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు తదితరులు

దర్శకులు : గుణశేఖర్

నిర్మాతలు: నీలిమ గుణ, దిల్ రాజు

సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం శాకుంతలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

 

కథ:

 

దుష్యంతుడు (దేవ్ మోహన్) మహా రాజు. ఒకసారి వేటకు వెళ్లినప్పుడు కణ్వ మహర్షి (సచిన్ ఖేడేకర్) ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్కడ ఉన్న శకుంతల (సమంత)ను చూసి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడవుతాడు. శకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. ఆ తర్వాత వీరి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ?, దుష్యంతుడు అసలు శకుంతలను ఎలా మర్చిపోతాడు ?, చివరకు వీరి ప్రేమ కథ ఎలా సాగింది ? ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ సినిమాను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమా చూస్తున్నంత సేపు మహాభారతంలోని ఆది పర్వంలోకి వెళ్లి.. శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను, బాధను కళ్ళ ముందు చూస్తున్న బావన కలుగుతుంది. ముఖ్యంగా 3డి విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. అలాగే ప్రేక్షకులకు ఆ అడవి ప్రాంతంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తమ్మీద అద్భుతమైన విజువల్స్ తో పాటు భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

ఇక సమంత తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా ఆకట్టుకున్నారు. హీరోగా నటించిన దేవ్ మోహన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో దేవ్ మోహన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మిగిలిన నటీనటులు సచిన్ ఖేడేకర్, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఎమోషనల్ గా లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా విజువల్ పరంగా కొంతవరకు ఆకట్టుకున్నా.. కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో అక్కడక్కడ కాస్త ఇంట్రెస్ట్ గా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర గర్భవతి అయ్యాక వచ్చే సీన్స్ ను అనవసరంగా ల్యాగ్ చేస్తూ డ్రైవ్ చేయడం వల్ల, ఆ సాగదీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది.

అలాగే మధ్యమధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కట్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతాయి. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే ఈ సినిమా కొంతవరకు అయినా సంతృప్తికరంగా ఉండి ఉండేది. కానీ, రొటీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో ఈ పౌరాణిక చిత్రం సాగడంతో సినిమా అవుట్ పుట్ బాగా దెబ్బ తింది. మెయిన్ గా సినిమాలో ప్రేమ కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగా పెట్టి ఉండాల్సింది. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ను ప్లే లో డిజైన్ చేసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు గుణశేఖర్ భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. కథాకథనాలను మాత్రం ఆ స్థాయిలో ఆయన రాసుకోలేదు. మణిశర్మ అందించిన సంగీతం ఏవరేజ్ గా ఉంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఓకే. కాకపోతే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

పౌరాణిక ప్రేమ జంట ‘శకుంతలా దుష్యంతుల’ ప్రేమ కథకు 3డి ఎఫెక్ట్ అద్ది.. బ్యూటిఫుల్ విజువల్స్ తో దర్శకుడు గుణశేఖర్ ఈ శాకుంతలం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే, గుణశేఖర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్, కథకథనాల పై పెట్టలేదు. రొటీన్ ప్లే అండ్ బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్స్ పరంగా మాత్రమే ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా నిరుత్సాహ పరిచింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు