సమీక్ష : శ్రీవల్లి – కన్ఫ్యూజన్ లో కాస్తా తడబడింది

Srivalli movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : విజయేంద్ర ప్రసాద్

నిర్మాత : సునీత, రాజ్ కుమార్ బృందావన్

సంగీతం : ఎం.ఎం శ్రీలేఖ, శ్రీ చరణ్ పాకాల

నటీనటులు : రజత్, నేహ హెంగే, రాజీవ్ కనకాల

బాహుబలి సీరిస్, బజరంగీ భాయ్ జాన్ సినిమాలతో రచయితగా విజయేంద్ర ప్రసాద్ ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని కథతో బాలీవుడ్ లో కూడా సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు. ఎప్పటి నుంచో రచయిత గా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి పని చేసిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమాతో అందరి ద్రుష్టిని ఆకర్షించారు. అయితే ఆయన అప్పుడప్పుడు దర్శకుడుగా కూడా తన టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్య రాజన్న సినిమాతో మంచి చిత్రాలు తీయగలిగే సత్తా తనలో కూడా ఉందని విజయేంద్ర ప్రసాద్ నిరూపించుకున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే అంచనాలు భాగానే ఉంటాయి. మరి అందరు కొత్తవాళ్ళతో సరికొత్త కథాంశంతో తీసిన శ్రీ వల్లి సినిమా ఎలా ఉందో కాస్తా తెలుసుకుందాం.

 

కథ:

వల్లి(నేహా హెంగే), రామచంద్ర(రాజేవ్ కనకాల) అనే ఒక సైంటిస్ట్ కూతురు. ఆమెకి గౌతమ్(రజిత్) అనే చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు ఉంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతని సాయంతో ఆమె తన ఫాదర్ కి ఇచ్చిన మాటని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి గాను ఆమె న్యూరో ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేసే ప్రొఫెసర్ కి సాయం చేస్తుంది. ఆ ప్రొఫెసర్ ఆమె ఆలోచనల మీద రీసెర్చ్ చేస్తూ. ఒకరి న్యూరాన్స్ సహాయంతో ఆలోచనలని అనుసంధానించడం ద్వారం ఎదుటి వారి మనసులో ఏముందో అనే తెలుసుకునే ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగం వల్లి తనమీదనే చేయించుకుంటుంది. ఆ ప్రయోగం జరిగిన తర్వాత ఆమె తెలియకుండానే ఒక రకమైన ప్రమాదంలో చిక్కుకుంటుంది. అలాగే ఏదో తెలియని ఒక ప్రమాదకర వలయంలో చిక్కుకుంటుంది. వల్లి ఆ ప్రమాదం నుంచి తనకు తానుగా ఎలా బయట పడింది. తన చుట్టూ జరుగుతున్నా విషయాలని ఎలా తెలుసుకుంది. చివరికి న్యూరో టెక్నాలజీ ద్వారా ఆలోచలని అనుసందానం చేస్తూ తనకి ఉన్న అపాయాన్ని ఎలా తప్పించుకుంది అనేది సినిమా కథ.

 

పాజిటివ్ పాయింట్స్:

సినిమాలో పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో. ఒక మనిషి భావ తరంగాలతో వేరొక మనిషి ఆలోచనలోకి ప్రవేశించి వారిని నియంత్రించడం లేదా వారి ఆలోచనలో ఏముందో తెలుసుకోవడం. ఈ పాయింట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రానటువంటి సరికొత్త కథ. ఇలాంటి కథతో సినిమా తీయాలనుకోవడం నిజంగా విజయేంద్ర ప్రసాద్ ఆలోచనలకి ఎవరైనా సలాం చేయాల్సిందే. సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప తెలుగు సినిమా అని ఎక్కడా అనిపించదు. అక్కడక్కడ విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న సన్నివేశాలు కూడా అద్బుతంగా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతంది అనే విషయం ఆడియన్స్ ఊహకి కూడా అందకుండా నడిపించడం ద్వారా కథ ఆద్యంతం ఒక సస్పెన్స్ తో నడుస్తుంది. నిజంగా ఇది ఆకట్టుకునే ప్రయత్నమే.

కథ మొత్తం వల్లి పాత్ర చేసిన నేహా హెంగే చుట్టూ తిరుగుతుంది. కొత్త అమ్మాయి అయినా ఆ పాత్రకి చాలా వరకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది కానీ అందులో ఎవరైనా భాగా పరిచయం ఉన్న అమ్మాయి అయితే ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యేది. ఇక సినిమాలో హీరోగా చేసిన కొత్త కుర్రాడు రజత్ పరవాలేదనిపించుకున్నాడు. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అందరికి షాక్ ఇస్తుంది. ఇక రాజీవ్ కనకాల పాత్ర కొంత సేపే అయినా ఉన్నంతలో ఓకే అనిపించాడు. ఒక సినిమాలో ప్రొఫెసర్ గా చేసిన ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ భాగానే ఉంది.

 

నెగిటివ్ పాయింట్స్:

సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అంటే అది కచ్చితంగా విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న కథనం. మంచి కథని చెప్పాలనుకోవడం వీలైనంతగా ఆడియన్స్ కి అర్ధమయ్యే రీతిలో ప్రెజెంట్ చేస్తే బాగుండేది కాని కథనం ఆద్యంతం కన్ఫ్యూజింగ్ గా వెళ్తూ ఏది ఫ్లాష్ బ్యాక్, ఇది రియల్, ఇది సైన్సు అనే విషయం ఆడియన్స్ కి అర్ధం కాకుండా చేసారు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలకి నటించడానికి చాలా స్కోప్ ఉంది. ఈ విషయంలో ఎవరైనా గుర్తింపు ఉన్న నటులతో ఈ పాత్రలు చేయించి ఉంటె ఆడియన్స్ కనెక్ట్ అయ్యేవారు. సినిమాలో కీలకమైన ప్రొఫెసర్ పాత్ర కూడా ఎవరైనా కాస్తా గుర్తింపు ఉన్న నటుడితో చేయించి ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు ఇది సైన్సు ఫిక్షనా, లేక హర్రర్ స్టొరీనా, లేక థ్రిల్లర్ స్టొరీనా అనే విషయం ఆడియన్స్ కి ఒక పట్టాన అర్ధం కాదు. దీంతో సినిమా చివరికి వచ్చేసరికి మొత్తం అంతా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇక కథలో కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. అంత గొప్ప రచయిత నుంచి ఇలాంటి సన్నివేశాలు కూడా వస్తాయా అనిపిస్తుంది.
 

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు భాగానే ఉన్నాయి. ఉన్నంతలో భాగా ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడుగా విజయేంద్ర ప్రసాద్ కథ విషయంలో సూపర్ అనిపించుకున్నా కథనంలో మాత్రం మెప్పించలేకపోయారు. ఇక శ్రీ చరణ్ పాకాలా బిజిఎం సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్ అయ్యింది. పాటలకు ఎం.ఎం శ్రీలేఖ తనలో ఎంత టాలెంట్ ఉందో మరో సారి చూపించింది. ఇక సినిమాటోగ్రఫీ ఓకే అనిపించుకుంది. ఎడిటింగ్ లో ఇంకా కొన్ని కట్స్ పడితే బాగుండేది. అయితే అదంతా విజయేంద్ర ప్రసాద్ విజన్ కాబట్టి ఎడిటర్ గురించి పెద్దగా మాట్లాడటానికి లేదు.

 

తీర్పు:

ఇక అంతిమంగా సినిమా గురించి చెప్పుకోవాలంటే మంచి కథ, హాలీవుడ్ స్థాయి మేకింగ్ విజన్ ఇవ్వాలని ప్రయత్నంలో దర్శకుడు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేశారు. సినిమాలో కీలకమైన వల్లి పాత్ర చేసిన నేహా కొంత వరకు ఓకే, ఇక హీరోగా చేసిన కొత్తకుర్రాడు ఎమోషన్స్ ని చూపించడంలో ఇంకా మెరుగుపడితే బాగుంటుంది. సినిమాకి సంగీతం పెద్ద బలం. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే అద్బుతమైన స్టొరీ లైన్ కి హాలీవుడ్ విజన్ కి సరైన స్పష్టతిండి కలిగిన కథనం లేకపోవడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ కు గురయ్యారు.
 

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team