సమీక్ష : ‘సుందరి’ – అక్కడక్కడ ఫర్వాలేదనిపించే ఫ్యామిలీ థ్రిల్లర్ !

సమీక్ష : ‘సుందరి’ – అక్కడక్కడ ఫర్వాలేదనిపించే ఫ్యామిలీ థ్రిల్లర్ !

Published on Aug 14, 2021 3:01 AM IST
Sundari movie review

విడుదల తేదీ : ఆగస్టు 13, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

తారాగణం: పూర్ణ, అర్జున్ అంబటి తదితరులు

దర్శకత్వం: కల్యాణ్‌ జీ గోగన

నిర్మాత : రిజ్వాన్‌

రచన: కల్యాణ్‌ జీ గోగన

సంగీతం : సురేష్‌ బొబ్బిలి

ఎడిటర్ : మణికాంత్

సినిమాటోగ్రాఫర్ : బాల్‌రెడ్డి

నటి పూర్ణ ప్రధాన పాత్రలో, అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మేంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

సుందరి (పూర్ణ) పక్కా పల్లెటూరి అమ్మాయి, పైగా అమాయకురాలు. ఇక ప్రభు (అర్జున్) ఓ పెళ్ళికి సుందరి ఊరు వస్తాడు. అక్కడ సుందరి అందాన్ని చూసి తొలి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు. సుందరి పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుని సిటీకి తీసుకువస్తాడు. సిటీ కల్చర్ పై ఏ మాత్రం అవగాహన లేని సుందరి సిటీలో ఎలాంటి ఇబ్బందులు పడింది ? భర్త ప్రభు ఉద్యోగం పోయాక ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ? ఆ సమస్యల నుండి బయట పడటానికి సుందరి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? చివరకు సుందరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్, అండ్ ఎమోషనల్ డ్రామా అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. ఇక పూర్ణ, సుందరి పాత్రలో అద్భుతంగా నటించింది. అమాయకపు అమ్మాయి పాత్రలో పూర్ణ నటించిన విధానం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

అలాగే పూర్ణ – ప్రభు మధ్య కెమిస్ట్రీ మరియు పూర్ణ క్యారెక్టర్ లోని షేడ్స్ బాగున్నాయి. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన ప్రభు కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదేవిధంగా సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకపోవడం మెయిన్ గా ఫస్ట్ హాఫ్ చాలా షార్ప్ గా ఉండటం బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ స్లోగా సాగాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. పూర్ణ పాత్ర – స్వామిజీ చుట్టూ అల్లుకున్న డ్రామాలో మెయిన్ మోటివ్ కూడా ఇంకా బలంగా ఉండి ఉంటే.. సినిమాలో మెయిన్ కాన్ ఫిల్ట్ బలంగా ఎలివేట్ అయ్యేది.

సెకండ్ హాఫ్ లో పూర్ణకి నిజం తెలిసే సన్నివేశాల్లో ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ ను ఇంకా ఎఫెక్టివ్ గా సస్టైన్ చేయాల్సింది. అదేవిధంగా సినిమాటిక్ గా అనిపించే ఎలిమెంట్స్ విషయంలో కూడా లాజిక్స్ ను బెటర్ చేయాల్సింది. అయితే, పూర్ణ – ప్రభు పాత్రల మధ్య డ్రామాను బాగానే ఎలివేట్ చేశారు. కానీ, పూర్ణ క్యారెక్టరైజేషన్ ను డెప్త్ గా రాసుకుని ఉండి ఉంటే, మెయిన్ రివేంజ్ డ్రామా స్ట్రాంగ్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది . తన కెమెరా యాంగిల్స్ తో బ్యూటీఫుల్ విజువల్స్ ను చూపించారు. అలాగే సురేష్‌ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. అలాగే సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు కల్యాణ్‌ జీ గోగన మంచి పాయింట్ తీసుకున్నా… ట్రీట్మెంట్ ను బాగా రాసుకోలేకపోయారు.

 

తీర్పు :

 

ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషనల్ ట్విస్ట్ తో వచ్చిన ‘సుందరి’ కొన్ని అంశాల్లో మరియు కొన్ని చోట్ల ఆకట్టుకుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ తో పాటు నటీనటుల నటన కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగడం, సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు