ఓటిటి సమీక్ష: సూపర్ డీలక్స్ – ఆహా వీడియో లో డబ్ చిత్రం (సమంత, విజయ్ సేతుపతి, ఫాహద్)

ఓటిటి సమీక్ష: సూపర్ డీలక్స్ – ఆహా వీడియో లో డబ్ చిత్రం (సమంత, విజయ్ సేతుపతి, ఫాహద్)

Published on Aug 9, 2021 12:05 AM IST
Super-Deluxe review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ :  3.25/5

నటీనటులు : విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్, సమంత అక్కినేని, రమ్య కృష్ణన్, మిస్కిన్, గాయత్రి, అశ్వంత్ అశోక్ కుమార్, అబ్దుల్ జబ్బర్, విజయ్ రామ్, నోబుల్ కే జేమ్స్, జయంత్, నవీన్, మిర్నాలిని రవి, కెవిన్ జై బాబు

దర్శకులు: త్యాగ రాజన్ కుమార రాజ

నిర్మాతలు : పి. మధు బాబు

సంగీతం : యువన్ శంకర్ రాజా

బ్యాన : శ్రీ సిద్దేశ్వర వైష్ణవి ఫిల్మ్స్

విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, ఫాహాద్ ఫాజిల్ ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించిన డార్క్ కామెడీ చిత్రం సూపర్ డీలక్స్. ఈ చిత్రం ను తెలుగు లో ఆహా వీడియో డబ్ చేయడం జరిగింది. విడుదల కూడా అయింది, ఇందుకు సంబంధించిన సమీక్ష ఇక్కడ చూద్దాం.

 

కథ:

 

విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, ఫాహద్ ఫాజీల్ మరియు రమ్య కృష్ణ లు తమ జీవితాలను మార్చుకొనే క్రమం లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఈ చిత్రం కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

సూపర్ డీలక్స్ చిత్రం ఎక్కువగా డార్క్ కామెడీ పై ఆధారపడి ఉంది. ఇందులోని ప్రధాన పాత్రలు తమను తాము కనుగొన్న వింత పరిస్థితుల ద్వారా ఎలా ప్రేరేపించబడుతుంది అని ఇందులో చూపబడుతుంది. ఈ చిత్రం లో వివిధ సామాజిక అంశాలను, నిషేదాలని చూపడం జరిగింది.

ఈ చిత్రం లో ప్రధాన తారాగణం యొక్క నటన హైలెట్ అని చెప్పాలి. విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, ఫాహద్ మరియు రమ్య కృష్ణ ల అద్బుతం అని చెప్పాలి. ఈ చిత్రం ను పూర్తి స్థాయిలో వీరు నడిపించారు. ఇతర తారాగణం అయిన అశ్వంత్, మిస్కిన్, భగవతి మరియు ఇతర తారాగణం తమ నటన తో సినిమా ను మరింత ముందుకు తీసుకు వచ్చారు.

సూపర్ డీలక్స్ చిత్రం లో నాలుగు సమాంతర కథలని చక్కగా చూపించడం జరిగింది. అంతేకాక అందుకు సంబంధించిన కథలు అన్ని కూడా గుండ్రంగా ఉండటం అద్బుతం అని చెప్పాలి. సినిమా పెద్ద క్లైమాక్స్ ను కలిగి ఉండటం ముగించిన విధానం బావుంది అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ కథ ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికీ ఇతరులు ఈ చిత్రాన్ని దూరం పెట్టే అవకాశం ఉందని చెప్పాలి. ఈ చిత్రం లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా లేదని చెప్పాలి.

ఈ చిత్రం లో పూజారి కి విగ్రహం కి సంబంధించిన ఒక సబ్ ప్లాట్ ఉంది, ఇది సరైన విధంగా ముందుకు సాగకుండా ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రం దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉండటం తో ప్రేక్షకులు కాస్త ఆసక్తి కనబరచరు అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

 

డైరెక్టర్ త్యాగరాజన్ కుమార రాజ ఒక నవల కథాంశాన్ని ఎంచుకొని చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ మరియు సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ అత్యంత నాణ్యత తో ఉందని చెప్పాలి. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా అద్బుతం గా ఉంది.

 

తీర్పు:

 

ఈ సూపర్ డీలక్స్ చిత్రం డార్క్ కామెడీ గా ఉందని చెప్పాలి. మధ్యలో కొన్ని సన్నివేశాలు అవాంతరం గా అనిపించినప్పటికీ కథలో నిమగ్నం అయ్యేలా చేస్తుంది. ప్రధాన తారాగణం నటన మరియు భావోద్వేగ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉన్నాయి. డార్క్ కామెడీ చిత్రాలను కోరుకొనే వారికి ఈ వారాంతం ఇది చక్కని చిత్రం అని చెప్పాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు