ఓటిటి రివ్యూ : తమన్నా “లెవెన్త్ హవర్” – తెలుగు సిరీస్ “ఆహా” లో ప్రసారం

విడుదల తేదీ : ఏప్రిల్ 09, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : తమన్నా భాటియా, అరుణ్ ఆదిత్, వంశీ కృష్ణ, మధుసూధన్ రావు, షత్రు, పవిత్ర లోకేష్, అనిరుధ్ బాలాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియా బెనర్జీ, జయప్రకాష్
దర్శకుడు: ప్రవీణ సత్తారు
నిర్మాత: ప్రదీప్ ఉప్పలపాటి
సంగీతం: భరత్-సౌరభ్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరల
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి

మన తెలుగు మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాత్ప్ “ఆహా” ద్వారా స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మొట్ట మొదటి సారిగా తెలుగు డిజిటల్ వరల్డ్ లోకి టాలెంటెడ్ దర్శకుడు పర్వీన్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన “లెవెన్త్ హవర్” తో అడుగు పెట్టింది.మరి ట్రైలర్ తో మంచి థ్రిల్ ను రైజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ లేటెస్ట్ గా ఆహాలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ వెబ్ సిరీస్ కథలోకి వెళ్లినట్టు అయితే..ఈ కథ అంతా ఒక్క రాత్రిలో గడిచే కథ. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అయినటువంటి అరత్రికా రెడ్డి(తమన్నా భాటియా) తమ కంపెనీ ద్వారా తమ దగ్గర ఉన్న అద్భుత పరిజ్ఞ్యానంతో భారతదేశం అంతటికీ క్లీన్ అండ్ సేఫ్ పవర్ ను అందించడానికి పూనుకుంటారు. అయితే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఉంటే పొలిటికల్ ప్రెజర్స్ తప్పనిసరి కదా అలానే కొన్ని పొలిటికల్ అంశాల ద్వారా ఇది జాతీయ స్థాయిలో హైలైట్ అవుతుంది.

దీనితో అక్కడ నుంచి వారి కంపెనీ ఓ బ్యాంకుకు జస్ట్ ఒక్క రోజు తర్వాత 8 గంటల లోపు ఏకంగా 9 వేల కోట్లు కట్టాల్సిన కష్టతర పరిస్థిఠీ ఏర్పడుతుంది. కేవలం ఒక్క రాత్రిలో జరిగే ఈ స్టోరీలో అరత్రికా తన కంపెనీని ఎలా కాపాడుకుంటుంది? అందుకు తప్పు దారిలో ఏమన్నా వెళ్తుందా? లేక నిజాయితీగానే ఈ సమస్యని ఎదుర్కొని గట్టెక్కుతుందా అన్నది తెలియాలి అంటే ఈ సిరీస్ ను తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

జెనెరల్ గా టైం తక్కువ ఉంది టార్గెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో అదే విధంగా దానిని చక్కగా హ్యాండిల్ చెయ్యగలిగితే దాని కోసం తెలుసుకున్న వారికి అంతే థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరి ఆ థ్రిల్ ను ఇవ్వడంలో టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు సూపర్బ్ అని చెప్పాలి. మళ్ళీ తనదైన మార్క్ కొన్ని ఎపిసోడ్స్ కీలకంగా రసవత్తరంగా నడిపించారు. అలాగే మొదటి ఎపిసోడ్ నుంచి కూడా ఇందులో గ్రిప్పింగ్ నరేషన్ కనబడడం మరో ప్లస్ పాయింట్.

ఇక అలాగే మెయిన్ లీడ్ తమన్నా విషయానికి వస్తే తన మొదటి స్ట్రీమింగ్ స్టెప్ బాగా ఎంచుకుంది చెప్పాలి. ఓ బిజినెస్ విమెన్ గా తాను ఎంచుకున్న రోల్ మంచి ఛాలెంజింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా తన నటనలో కూడా చాలా కాన్ఫిడెన్స్ ఈ వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. అలాగే కొన్ని కీలక పార్ట్స్ లో తమన్నా నటన చాలా బాగుంటుంది. ఇక అలాగే మిగతా కీలక నటులు అయినటువంటి మధు సూధన్, శత్రు, జయ ప్రకాష్ సహా అదిత్ అరుణ్ లు కూడా తమ నుంచి కొత్త నటనను కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇవి కూడా కాస్త క్లియర్ గానే కనిపిస్తాయి. మొదట మెన్షన్ చేసినట్టుగా స్టార్టింగ్ లోనే మంచి గ్రిప్పింగ్ నరేషన్ ఉన్నా మెల్లగా అంశాలు నెమ్మదిస్తాయి. పైగా కొన్ని పాత్రలకు సంబంధించి డ్రామా కూడా ఎక్కువ అనిపించడం మూలాన థ్రిల్ గా అనిపించే కాసేపటికి మళ్ళీ నరేషన్ పై ఇంట్రెస్ట్ తగ్గుతుంది.. దీనితో అవి మిగతా నరేషన్ లో అనవసరం అనిపిస్తుంది. వీటితో పాటుగా క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టీవ్ గా అనిపించదు.

దానిని బాగా హ్యాండిల్ చేసేందుకు ఆస్కారం ఉన్నా అలా సెటప్ చెయ్యకపోవడం బాధాకరం. అలాగే ఇందులో కనిపించే ఇతర కీలక పాత్రలలో కనిపించిన అదిత్ అరుణ్, మధుసూదన్ తదితరులు తమ రోల్స్ మేర పెర్ఫామెన్స్ బాగుంది కానీ వాటిని తీర్చిదిద్దిన విధానం ఏమంత గొప్పగా అనిపించదు. దీనితో ఈ సిరీస్ లో అంతగా స్కోప్ లేని విధంగా అనవసరం అన్నట్టు అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ సిరీస్ లో మొట్ట మొదటిగా నిర్మాణ విలువలకు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన ఏ డిజిటల్ కంటెంట్ లో లేని ఉన్నతమైన నిర్మాణ విలువలు ఇందులో కనిపిస్తాయి ఇది మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. అలాగే టెక్నీకల్ టీం లో మ్యూజికల్ వర్క్ బాగుంది. ప్రతీ ఎపిసోడ్ లో ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

కాకపోతే ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే తన పనితనం సినిమా వరకు మనకి తెలిసిందే. అలాగే తన ఇంటెలిజెన్స్ ఈ సిరీస్ లో కూడా కనిపిస్తుంది. కానీ అసంపూర్తిగా అనిపిస్తుంది. స్టార్టింగ్ సహా కొన్ని పార్టులలో తన నరేషన్ బాగుంటుంది కానీ ఓవరాల్ గా మాత్రం ప్రవీణ్ పనితనం ఓకే అనేంతలా మాత్రమే ఉంటుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “లెవెన్త్ హవర్” లో ప్రవీణ్ సత్తారు కొంతమేర గ్రిప్పింగ్ నరేషన్ తో ఆకట్టుకుంటాడు అలాగే తమన్నా ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ సహా ఇందులో కనిపించే పలు ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఇవి బాగానే ఉన్నా కొన్ని లూప్ హొల్స్ కూడా ఇందులో కనిపిస్తాయి, అనవసర డ్రామా ఎక్కువ కావడం, అక్కడక్కగా స్లోగా సాగే నరేషన్ సహా ప్రవీణ్ టేకింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. కానీ ఎక్కువ హైప్ పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ మోస్తరుగా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :