ఓటీటీ రివ్యూ : తమిళ్ రాకర్స్‌ – తెలుగు వెబ్ సిరీస్ సోనిలివ్ లో ప్రసారం

ఓటీటీ రివ్యూ : తమిళ్ రాకర్స్‌ – తెలుగు వెబ్ సిరీస్ సోనిలివ్ లో ప్రసారం

Published on Aug 21, 2022 11:40 PM IST
Tees Maar Khan Movie Review In Telugu

విడుదల తేదీ : ఆగస్టు 19, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అరుణ్ విజయ్, వాణి భోజన్, ఐశ్వర్య మీనన్ తదితరులు.

దర్శకత్వం : అరివళగన్

నిర్మాతలు: అరుణ గుహన్, అపర్ణ అగుహన్ శ్యామ్

సంగీత దర్శకుడు: వికాస్ బాదిస

సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్

ఎడిటర్: విజే సాబు జోసెఫ్

దర్శక నిర్మాతలకు భయం పుట్టించిన పైరసీ భూతం తమిళ్‌ రాకర్స్‌ ఇతివృత్తంతో దర్శకుడు అరివళగన్‌ తెరకెక్కించిన సిరీస్‌ తమిళ రాకర్స్. అరుణ్‌ విజయ్ నటించిన ఈ వెబ్‌సిరీస్‌ సోనీలివ్‌లో స్ట్రీమ్‌ అయింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

 

కథ

యాక్షన్‌ హీరో ఆదిత్య హీరోగా మది (అజగమ్‌ పెరుమాళ్‌) అనే నిర్మాత రూ. 300 కోట్లతో ‘గరుడ’ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తాడు. అయితే, ఈ చిత్రం విడుదల సమయంలో తమిళ రాకర్స్‌ ఆ సినిమాలోని కొన్ని వీడియో క్లిప్స్‌ను లీక్ చేసి ముందు రిలీజ్ చేస్తాయి. పైగా వీడియో క్లిప్పింగ్స్‌నే కాకుండా.. తమిళ్‌ రాకర్స్‌ పూర్తి చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తామని బెదిరిస్తోంది. దాంతో మది పోలీసులను ఆశ్రయిస్తాడు. దాంతో ఈ కేసు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని స్పెషల్‌ ఆఫీసర్‌ రుద్ర (అరుణ్‌ విజరు) దగ్గరకు వెళ్తుంది. మరి ఈ కేసుకు లింక్‌గా ఉండే సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ సంధ్య (వాణి భోజన్‌)తో కలిసి రుద్ర తమిళ్‌ రాకర్స్‌ నెట్‌వర్క్‌ను పట్టుకున్నాడా? లేదా ?, అసలు ఇంతకీ ఈ నెట్‌వర్క్‌ వెనుకున్న వ్యక్తులెవరు? చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

వాణి భోజన్ తండ్రిగా చిన్న అతిధి పాత్రలో నటించిన MS భాస్కర్, పైరసీ కారణంగా సినిమాతో సంబంధం ఉన్న వాటాదారులందరూ ఎలా నష్టపోతారో వివరించిన సీన్స్ బాగున్నాయి. ఈ ప్రత్యేక సన్నివేశం సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సీన్స్ లోని కంటెంట్ మనల్ని బాగా ఆలోచింపజేస్తుంది. ఈ సీన్స్ లో ఎమోషన్స్ కూడా చాలా బాగా ఎలివెట్ అయ్యాయి.

అసలు ఈ పైరసీ వెబ్‌సైట్‌లు ఎలా పనిచేస్తాయి, వీటి వెనుక ఎలాంటి వ్యక్తులు ఉంటారు లాంటి విషయాల్ని కూడా చాలా బాగా చూపించారు. నటీనటుల విషయానికి వస్తే అరుణ్ విజయ్ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ఈ సిరీస్‌ని అరుణ్ విజయ్ తన భుజానికెత్తుకున్నాడు. మిగిలిన ప్రధాన పాత్రలలో, వాణి భోజన్‌కు కథతో పాటు ప్రయాణించే పాత్ర దక్కింది. ఆమె కూడా తన పాత్రలో బాగానే నటించింది.

ఇక పైరసీ భయంతో విలవిలలాడే సినిమా నిర్మాతగా అజగమ్ పెరుమాళ్ చాలా బాగా నటించాడు. అలాగే ఐశ్వర్యమేనన్‌, మరిముత్తు, వినోద్‌ సాగర్‌ తదితర నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించారు. వికాస్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్ లో గ్రిప్పింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, అవి చాలా తక్కువ. పైగా కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. అసలు ఒక పరిశోధనాత్మక థ్రిల్లర్ ను ప్రేక్షకులు నిమగ్నమై చూడటానికి గ్రిప్పింగ్ నేరేషన్ అవసరం. కానీ ఈ సిరీస్ లో ఆ నేరేషన్ మిస్ అయ్యింది.

పైగా చాలా సీన్స్ లో ఎటువంటి కారణం లేకుండా కథను అతిగా సాగదీశారు. దీనికితోడు నిడివి ఎక్కువ ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. సిరీస్‌ను 6-7 ఎపిసోడ్‌లలో ఇంకా ఎఫెక్టివ్ గా ముగించి ఉండాల్సింది. కాకపోతే రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. కానీ, కథ కథనాలు మరీ స్లోగా సాగడం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ అయితే అసలు మోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సిరీస్ ను ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.

మొత్తానికి ఈ ఎమోషనల్ సిరీస్ లో కొన్ని సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

సిరీస్ లో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది.
ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఈ సిరీస్‌కి బి. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ హైలెట్‌. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి

 

తీర్పు :

మొత్తమ్మీద, ఈ తమిళ్‌ రాకర్స్‌ సిరీస్ ఊహాజనిత సన్నివేశాలతో ప్రతీకార నేపథ్యంలో సాగింది. ఇక సిరీస్ లో అరుణ్ విజయ్ మరియు ఇతర తారాగణం నటన, మరియు సినిమా పరిశ్రమకు సంబధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బాగున్నాయి. అయితే, రైటింగ్ టీమ్ ఈ సిరీస్ స్క్రిప్ట్‌పై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్ గా ఈ సిరీస్ పై మీరు భారీ అంచనాలను పెట్టుకుని చూస్తే.. కచ్చితంగా నిరాశ చెందుతారు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు