సమీక్ష : బసంతి – ఆకట్టుకోలేకపోయిన మరో టెర్రరిస్ట్ డ్రామా

Basanti విడుదల తేది : 28 ఫిబ్రవరి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : చైతన్య దంతులూరి
నిర్మాతలు : చైతన్య దంతులూరి
సంగీతం : మణిశర్మ
నటినటులురాజా గౌతమ్, అలీసా బైగ్ ….

కామెడీ కింగ్ బ్రహ్మానందం కుమారుడిగా ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ మొదటి సినిమాతో పరవాలేదనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలేవి అతని కెరీర్ కి సహకరించలేదు. దాంతో కొంత కాలం గ్యాప్ తీసుకొని తన నటనని మరింత మెరుగుపరుచుకొని ‘బాణం’ సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న డైరెక్టర్ చైతన్య దంతులూరితో కలిసి చేసిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బసంతి’. శివరాత్రి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకోవాలని గౌతమ్, చైతన్య దంతులూరి ఎంతో కసితో చేసిన ఈ ‘బసంతి’ సినిమా వారి కోరికని తీర్చే రేంజ్ లో ఉందో లేదో ఇప్పుడు చూద్దాం …

కథ :

ఓపెన్ చెయ్యగానే హైదరాబాద్ లోని ఓ పార్క్ లో బాంబ్ బ్లాస్ట్. అక్కడి నుంచి కట్ చేస్తే 3 నెలల తర్వాత ఆ ఘటనకి బాధ్యుడైన బాబా ఖాన్ ని అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే అర్జున్ (రాజా గౌతమ్) మనలో ఒక్కడిలా కనిపించే మిడిల్ క్లాస్ కుర్రాడు. అతను బసంతి కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. అర్జున్, అబ్బాస్(రణధీర్), స్వాతి, మల్లి(ధనరాజ్) మంచి ఫ్రెండ్స్.

అలా హ్యాపీ గా లైఫ్ ని గడిపేస్తున్న అర్జున్ రోషిని(ఆలీషా బైగ్) ని చూసి ప్రేమలో పడతాడు. ఓ సందర్భం ద్వారా అర్జున్ – రోషిని మధ్య పరిచయం ఏర్పడుతుంది. తన ప్రేమని చెప్పాలనుకునే టైంకి రోషిని తన స్టడీస్ కోసం లండన్ వెళ్లిపోతున్నానని చెప్పడంతో అర్జున్ బాధపడతాడు. అయిన అసారే తన ప్రేమని చెప్పాలనుకున్నప్పుడు రోషిని కనపడకుండా పోతుంది.

అదే సమయంలో కొంతమంది టెర్రరిస్టులు బాబా ఖాన్ రిలీజ్ చేయించడం కోసం ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్లాన్ పోలీసులకి తెలిసిపోవడంతో వాళ్ళు ప్లాన్ మార్చి బసంతి కాలేజ్ ని టార్గెట్ చేస్తారు. అర్జున్ ఫ్రెండ్స్ అందరూ కాలేజీ లోపల టెర్రరిస్టులకి బందీలుగా ఉండిపోతారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని టెర్రరిస్టులు బాబా ఖాన్ ని రిలీజ్ చేయమని కోరతారు. అక్కడి నుండి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? టెర్రరిస్టుల కోరికలను పోలీసులు తీర్చారా? లేదా? అసలు రోషిని ఏమైంది? చివరికి అర్జున్ – రోషిని కలిసారా? లేదా? అనేది మిగిలిన కథాంశం..

ప్లస్ పాయింట్స్ :

గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో రాజా గౌతమ్ మంచి నటనని కనబరిచాడు. అలాగే చూడటానికి లుక్స్ పరంగా కూడా బాగున్నాడు. డైరెక్టర్ అనుకున్న పాత్రకి తన వంతు న్యాయం చేసాడు. ఆలీషా బైగ్ పాత్రలో చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఓ సూపర్బ్ అనేంత లేకపోయినా బాగుంది. అలాగే చూడటానికి ఫ్రెష్ గా ఉంది.

ఇంటర్వల్ బ్లాక్ చాలా బాగుంది. ఆ తర్వాత అదే ఫీల్ ని సెకండాఫ్ లో 10 నిమిషాలు కొనసాగించడం, అక్కడ వచ్చే రెండు ట్విస్ట్ లు బాగున్నాయి. రణధీర్, ధనరాజ్, స్వాతి, సాయాజీ షిండే, తనికెళ్ళ భరణి లు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలని కూడా బాగా షూట్ చేసారు.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ అందరినీ ఆకట్టుకునే రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేసాడు కానీ అదే ఫీల్ ని సినిమాలో చూపించలేకపోయాడు. అందులోనూ దాదాపు కథని మొత్తం ట్రైలర్ లో చెప్పేయడంతో ప్రేక్షకులకు పెద్ద ఆసక్తికరంగా ఏమీ అనిపించదు. అలాగే సినిమాని బాగా ఓ రేంజ్ కి ఎలివేట్ చెయ్యాల్సిన టైంలో ఎలివేట్ చెయ్యకుండా సినిమా మొత్తాన్ని పడుకోబెట్టేయడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగా ఉంది.

సెకండాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఇక సినిమాలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు. డైరెక్టర్ రాసుకున్న ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

ఇందులో మొదటగా చెప్పాల్సింది మణిశర్మ మ్యూజిక్ గురించి.. ఆయన అందించిన పాటలు బయట ఎంత హిట్ అయ్యాయో, సినిమాలో కూడా అంత హిట్ అయ్యాయి. అలాగే సినిమాలో ప్రతి సీన్ కి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. మణిశర్మ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక అనిల్ బండాలి, పికె వర్మలు అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చూపించింది హైదరాబాద్ లోకేషన్స్ నే అయినా చాలా గ్రాండ్ గా చూపించారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సెకండాఫ్ మీద కాస్త శ్రద్ధ సినిమా అవేగాన్ని పెంచడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయి.

ఇక డైరెక్టర్ సినిమా కోసం అనుకున్న కంటెంట్ బాగుంది. కానీ దాన్ని తీయడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమాలో ఎలివేట్ చేయాల్సిన సీన్స్ చాలా ఉంటాయి, ఆడియన్స్ కనెక్ట్ కావాల్సిన ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. కానీ వాటిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయాడు. నటీనటుల నుండి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నా సినిమాని ఆసక్తికరంగా నడిపించడంలో మాత్రం చైతన్య దంతులూరి ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

అన్ని వర్గాల ప్రేక్షకులని టార్గెట్ చేసి తీసిన ‘బసంతి’ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రమే పరిమితం అని చెప్పాలి. ట్రైలర్ లో ప్రేక్షకులకి కలిగించిన ఫీల్ ని మూవీ సెకండాఫ్ లో ఒక అరగంట క్రియేట్ చేసి ఉన్నా సినిమా ఓ రేంజ్ లో ఉండేది. అలా చెయ్యకపోవడం వల్ల ఈ సినిమా ఎ సెంటర్, మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ వరకు మాత్రమే పరిమితమయ్యింది. ఎందుకంటే ఇందులో బి,సి సెంటర్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది. గౌతమ్ నటన, ఇంటర్వల్ బ్లాక్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకి హైలైట్స్. చివరిగా ‘బసంతి’ ఒక తరహా ఆడియన్స్ ని మెప్పించే చిత్రం..

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More