సమీక్ష : ‘విజయ రాఘవన్‌’ – స్లోగా సాగే ఎమోషనల్ మెసేజ్ డ్రామా !

Vijaya Raghavan Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు

దర్శకుడు: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

సంగీత దర్శకుడు: నివాస్‌ కె.ప్రసన్న

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

ఎడిటర్: విజయ్‌ ఆంటోని

విజయ్‌ ఆంటోని హీరోగా ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ రూపొందించిన సినిమా ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ పేరుతో తెలుగులో ఈ సినిమా ఈ రోజు విడుద‌లైంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

విజయ్‌ ఆంటోని (‘విజయ రాఘవన్‌’) తన తల్లి ఆశయం కోసం ఐఏఎస్ అవ్వాలని కలలు కంటూ కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గవర్నమెంట్ కాలనీలో ఉంటూ అక్కడ పిల్లలకు ట్యూషన్ చెబుతూ.. మరోపక్క ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే, అక్కడున్న రౌడీ సూరి గ్యాంగ్ తో గొడవ, ఆ గొడవ కారణంగా కొన్ని ఇబ్బందులు.. దాంతో రౌడీ గ్యాంగ్ విజయ రాఘవన్‌ ను ఐఏఎస్ ఇంటర్వ్యూకి హాజరవ్వకుండా అతన్ని కొట్టి నీళ్లలో పడేస్తారు. తన జీవిత ఆశయాన్ని కోల్పోయి ఆ బాధలో నలిగిపోతున్న విజయ రాఘవన్‌ కి, అతని తల్లి ఎలా దైర్యం చెప్పి, మోటివ్ చేసింది ? అతను తిరిగి అదే గవర్నమెంట్ కాలనీలో ఎలా కార్పొరేటర్ గా గెలిచాడు ? చివరకు అతని ప్రస్థానం ఎలా సాగింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సిటీలోని స్లమ్ ఏరియాలోని వాస్తవ పరిస్థితులను వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు ఆనంద కృష్ణన్‌ తీసుకున్న జాగ్రత్తలు.. ముఖ్యంగా స్లమ్ నేపథ్యం దగ్గరనుంచీ.. అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం.. ఇలా ప్రతిది ఆనంద కృష్ణన్‌ చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు.

విజయ రాఘవన్‌ జర్నీ తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి. విజయ రాఘవన్‌ ను ప్రత్యర్థులు ఎటాక్ చేసే సన్నివేశం.. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు (మదర్ సెంటిమెంట్ సీన్స్) ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. ఇక విజయ రాఘవన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు.

అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో చెప్పిన మెసేజ్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు ఆనంద కృష్ణన్‌, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆనంద కృష్ణన్‌ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. అలాగే సినిమాని ఎక్కువగా బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్ తో డ్రైవ్ చేశాడు.

పైగా సినిమాలోని మెయిన్ ఎమోషన్ని కూడా అంతే ఎఫెక్టివ్ గా ఎలివేట్ చేయలేక పోయాడు. మధ్య మధ్యలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో నిరాశ పరిచాడు. పైగా ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకోవు. ఓవరాల్ గా కీలక సీన్స్ బాగానే ఉన్నా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు. ఆ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే .. నివాస్‌ కె.ప్రసన్న అందించిన పాటలు బాగున్నాయి. ఇక ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఆనంద కృష్ణన్‌ స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు :

 

తన తల్లి జీవితంలో జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని, ఆ బాధనే ఒక ఆశయంగా మార్చుకుని ఎదిగిన ‘విజయ్‌ రాఘవన్‌’ జర్నీ కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన బాగున్నాయి. ముఖ్యంగా మదర్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అయితే, సెకండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, ‘ప్లే’లో క్లారిటీ మిస్ అవ్వడం కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలుస్తాయి. దాంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :