సమీక్ష : ‘విశ్వరూపం 2’ – కన్ ఫ్యూజన్ సీక్వెల్

 Vishwaroopam2 movie review

విడుదల తేదీ : ఆగష్టు 10, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా

దర్శకత్వం : కమల్ హాసన్

నిర్మాతలు : కమల్ హాసన్, చంద్ర హాసన్

సంగీతం : మొహమ్మద్ గిబ్రన్

సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్, శాందత్

రచన, స్క్రీన్ ప్లే : కమల్ హాసన్

ఎడిటర్ : మహేష్ నారాయణ్, విజయ్ శంకర్

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమల్ హాసన్ తను స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘విశ్వరూపం 2’. కాగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియాలు కమల్ సరసన నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:

వీసామ్ (క‌మ‌ల్ హాసన్) ‘రా’ ఏజెంట్. ఇండియాని ఉగ్రవాదుల నుంచి కాపాడే క్రమంలో ఉగ్రవాదులతో మరియు ఒమర్ (రాహుల్ బోస్)తో చేరి వారికి స్నేహితుడిగా నమ్మించి ఉగ్రవాదులు ప్లాన్ లకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు ఇండియాలోని తన పై అధికారికి చేరవేస్తుంటాడు.

ఈ క్రమంలో వీసామ్ కు ఎదురయ్యే ఛాలెంజ్ స్ ఏమిటి ? అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హెడ్ ని పట్టుకొన్నే క్రమంలో విసామ్ ఎలాంటి పరిస్థితులను అదిగమించాడు ? తనని నమ్మించి మోసం చేసిన వీసామ్ ను ఒమర్ ఎలా అంతం చేయాలనుకున్నాడు ? అంతం చేసే క్రమంలో వీసామ్ ఒమర్ కి సంబంధించి చెప్పిన నిజం ఏమిటి ? చివరకి వీసామ్ ఉగ్రవాదులను అంతం చేసాడా లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమల్ హాసన్ అద్భుతమైన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఆయన నటన కోసమే థియేటర్ కి వచ్చే ప్రేక్షకులను ఆయన తన నటన పరంగా మెప్పించారు. అంచనాలను అందుకోలేని ఈ చిత్రాన్ని ఆయన తన హావభావాలతో కీలక సన్నివేశాల్లో తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేసారు

కమల్ తన తల్లిని కలుసుకున్నే సన్నివేశంలో వచ్చే చిన్ననాటి కొన్ని ఫ్లాష్ బ్యాక్ షాట్స్ మరియు బాక్ గ్రౌండ్లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ బాగుంటుంది.

అలాగే యూఎస్ ఆర్మీకి ఆల్ ఖైదా గ్యాంగ్ మధ్యన జరుగుతున్న మేజర్ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇక కమల్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తన నటన తో పాటు తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వారి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.

పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్, శేఖర్ కపూర్ లాంటి మంచి నటినటులు ముఖ్యమైన పాత్రలను పోషించి వారి నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

కమల్ హాసన్ నటుడిగానే కాకుండా ఈ చిత్రానికి రచయితగా దర్శకుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. ఆయన నటుడిగా మెప్పించినప్పటికీ ఇతర విభాగాల్లో విఫలమయ్యారు. ప్లో లేని కథలో, కన్ ఫ్యూజన్ నిపింన కథనంతో సినిమా పై ఆసక్తిని చంపేస్తారు.

ఈ చిత్రం కేవలం మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కు, ఏ సెంటర్స్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. అయినా వారిని కూడా సంతృప్తి పరచదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్లో గా సాగడం, కథనంలో క్లారిటీ మిస్ కావడం ఈ సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి.

మొత్తానికి భారీ అంచనాలు మధ్యన విడుదలైన ఈ చిత్రం బాగా డిజ్పాయింట్ చేస్తోంది. కమల్ హాసన్ రాసుకున్న కథ కథనాలను ఇంకా అర్ధవంతంగా రాసుకొని ఉండి ఉంటే, స్క్రీన్ నేరేషన్ మరింత పగడ్భందిగా ప్రజెంట్ చేసి ఉంటే ఈ చిత్రం బాగా వచ్చేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే సాంకేతికంగా విశ్వరూపం 2 చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. సను జాన్ వర్గీస్, శాందత్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. విసింగించే కథనంతో నిరసించిపోయే ఆడియన్స్ కి వీరు అందించిన బ్యూటిఫుల్ విజువల్స్ కొంతవరకు ఊరట కలిగిస్తాయి.

మహేష్ నారాయణ్ మరియు విజయ్ శంకర్ ఎడిటింగ్ పర్వాలేదు. కానీ సెకెండాఫ్ లో కథకు అక్కర్లేని సీన్స్ ల్లో, క్లారిటీ సీన్స్ ల్లో వారి ఎడిటింగ్ పనితనం ఇంకా కనబర్చి ఉండాల్సింది.

మొహమ్మద్ గిబ్రన్ సమకూర్చిన సంగీతం ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. కమల్ హాసన్, చంద్ర హాసన్ లు నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

తీర్పు:

ముందే చెప్పుకున్నట్లు ఈ చిత్రం కేవలం మల్టీప్లెక్స్ మరియు ఏ సెంటర్ లకు మాత్రమే పరిమితం అవుతుంది. వారిని కూడా పూర్తిగా సంతృప్తి పరుస్తోందని చెప్పలేము. సినిమాలో సినిమాటోగ్రఫీ మరియు స్టంట్స్ బాగానే ఉన్నప్పటికీ, కన్ ఫ్యూజన్ నేరేషన్ తో, ప్లో లేని స్టోరీతో మరియు స్క్రీన్ ప్లేలో అనవసరంగా వచ్చే క్లారిటీ లేని సీన్లుతో ఈ చిత్రం ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద ఎన్నో అంచనాల మధ్య వచ్చిన విశ్వరూపం 2 ఓ కన్ ఫ్యూజన్ సీక్వెల్ గా మిగిలిపోయింది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :