“పుష్ప 2” ప్రోమోకి కూడా మిక్స్డ్ స్పందన.. కానీ

“పుష్ప 2” ప్రోమోకి కూడా మిక్స్డ్ స్పందన.. కానీ

Published on Apr 25, 2024 9:01 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2”. మరి భారీ హైప్ లో ఉన్న ఈ చిత్రాన్ని సుకుమార్ ఊహించని లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప రూల్ ఉంటుంది అనేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సహా ఒకో అప్డేట్ ని కూడా మేకర్స్ మొదలు పెడుతున్నారు.

అలా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ అనౌన్స్ చేయగా నిన్ననే సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో ‘పుష్ప పుష్ప’ (Pushpa Pushpa) ని రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోకి ఇటీవల వస్తున్నా అనేక పెద్ద సినిమాల పాటలు తరహాలో మిక్స్డ్ స్పందనతోనే మొదలైంది. కేవలం కొన్ని సెకండ్స్ బిట్ మాత్రమే దేవీ వదలగా అప్పుడే దానిపై ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

అయితే గతంలో కూడా పుష్ప 1 లోకి ప్రతి సాంగ్ కూడా ఇలానే మొదలైంది. కానీ సీన్ కట్ చేస్తే పుష్ప ఆల్బమ్ ఇండియా లోనే హైయెస్ట్ వ్యూస్ ఉన్న సెన్సేషనల్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కి కూడా డెఫినెట్ గా ఇలా జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి దేవిశ్రీ ప్రసాద్ పైన తన ఫ్యాన్స్ కి మాత్రం గట్టి నమ్మకం ఉంది. మరి చూడాలి పుష్ప 2 ఆల్బమ్ ఎలాంటి స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు