‘హైపర్’ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నిర్మాతలు
Published on Oct 5, 2016 9:21 am IST

hyper-in
తాజాగా హీరో రామ్ నటించిన ‘హైపర్’ చిత్రం మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 14 రీల్స్ బ్యానర్ పై దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్సుని బాగా ఆకట్టుకుంటోంది. ఈ విజయం పట్ల చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కమర్షియల్ సినిమాకి ఓ మంచి సోషల్ మెసేజ్ అని అద్ది మంచి సినిమా తీశారని అన్నారు.

ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు స్పెషల్ షోల కోసం రిక్వెస్ట్ చేస్తున్నారని, ఇది చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు, తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ వంటి అంశాలను బాగా చూపారని, హీరో రామ్ ఎనర్జిటిక్ నటన సినిమా విజయంలో కీకపాత్ర పోషించాయని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు.

 
Like us on Facebook