అఖిల్ మూడో సినిమాకు ముహూర్తం ఖరారు !

అఖిల్ మూడో సినిమాకు ముహూర్తం ఖరారు !

Published on Mar 16, 2018 10:20 AM IST

అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ వెంకి అట్లూరితో చెయ్యబోతున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈనెల 26న జరగబోతున్నాయి. వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ స్క్రిప్ట్ ఓకే చేశారని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కు సంభందించి పూర్తి వివరాలు ముహూర్తం రోజున తెలియనున్నాయి. ముందుగా అఖిల్ సినిమా కోరటాలతో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ వెంకి అట్లూరి సినిమా మొదలు కాబోతుండడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరి మొదటి సినిమా ‘తొలిప్రేమ’తో మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి అఖిల్ ను ఎలా చూపిస్తాడో, అతనితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు