ఫ్యూచర్ స్టార్ హీరో అంటూ అక్కినేని అఖిల్ పై ప్రసంశలు.

ఫ్యూచర్ స్టార్ హీరో అంటూ అక్కినేని అఖిల్ పై ప్రసంశలు.

Published on Sep 30, 2014 8:47 PM IST

Akhil

ఫస్ట్ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే కింగ్ నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ స్టార్ అయిపోయాడు. ఒక్క సినిమాలో కూడా నటించకుండానే ఇంటర్నేషనల్ బ్రాండ్ టైటాన్ వాచెస్ కు బ్రాండ్ అంబాసిడర్ సైన్ చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా అఖిల్ నటించిన టైటాన్ టైంలెస్ యాడ్ వీడియో విడుదలయింది. తన నటనతో అఖిల్ అందరిని ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ అఖిల్ పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. భవిష్యత్ సూపర్ స్టార్ గా వర్ణిస్తున్నారు.

అఖిల్, బాలీవుడ్ హీరోయిన్ కల్కి కోచ్లిన్ ఈ యాడ్ లో జంటగా నటించారు. అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్, స్టైల్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత అఖిల్ తొలిచిత్రంపై అంచనాలు పెరిగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని రోజులుగా అఖిల్ ఫస్ట్ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. ‘ఒక లైలా కోసం’ విడుదల తర్వాత ఈ సినిమాకి సంబందించిన వివరాలు వెల్లడిస్తానని అఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే.

టైటాన్ టైంలెస్ యాడ్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు