కొత్త దర్శకుడికి బన్నీ అవకాశమిస్తున్నాడా ?

కొత్త దర్శకుడికి బన్నీ అవకాశమిస్తున్నాడా ?

Published on Oct 17, 2017 12:34 PM IST


“డిజే” సినిమా తరువాత అల్లు అర్జున్ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతొంది. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లో అను ఇమ్యానుల్ హీరోయిన్. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత బన్నీ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటునున్నాడని, ఇప్పటికే ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని వినికిడి. అంతేగాక ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతొందని కూడా అంటున్నారు. మరి ఆ కొత్త దర్శకుడు ఎవరు, ఈ వార్తలో ఏమేరకు నిజముంది అనే విషయాలు తేలాలంటే కొంత సమయం ఎదురుచూడక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు