యాక్షన్ షెడ్యూల్ మొదలు పెట్టిన బాలయ్య

యాక్షన్ షెడ్యూల్ మొదలు పెట్టిన బాలయ్య

Published on Jan 28, 2015 8:32 AM IST

balayya-lion
న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు. బాలయ్య తన రాజకీయ వ్యవహారాల వల్ల గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా న్యూ షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. అది కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ తో ఈ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. బాలకృష్ణ పై షూట్ చేసే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో మరో 6 రోజులు జరగనుంది.

ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో బాలకృష్ణతో పాటు హీరోయిన్ త్రిష, ప్రకాష్ రాజ్, జయసుధ, చలపతిరావు తదితర ప్రముఖ నటులు పాల్గొంటున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు