బన్నీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !

బన్నీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !

Published on Mar 5, 2017 11:55 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఆఖరి దశలో ఉండగానే బన్నీ తన నెక్స్ట్ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ‘రేసు గుర్రం, టెంపర్’ వంటి సినిమాలకు రచయితగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందట.

అంతేగాక ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో కాస్త దేశభక్తి సారాంశం కూడా ఉంటుందని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్, ఇటీవలే ‘ధోనీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియర అద్వానీని అనుకుంటున్నారట. ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని ఒకవేళ ఆమె డేట్స్ దొరక్కపోతే పూరి ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పఠానిని తీసుకోవాలనే ముందస్తు ప్లాన్ కూడా రెడీగా ఉందట. మరి వీరిద్దరిలో బన్నీకి హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు