రాజమౌళిపై సెలబ్రిటీల అభినందనల వర్షం

రాజమౌళిపై సెలబ్రిటీల అభినందనల వర్షం

Published on Apr 28, 2017 3:12 PM IST


రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రం పట్ల కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక సినీ స్టార్ హీరోలు,హీరోయిన్లు, ఇతర టాప్ దర్శకులు కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. అందుకే సామాన్య జనంతో పాటే వాళ్ళు కూడా మొదటి రోజు మొదటి షో చూసి సంబరపడిపోతూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ రాజమౌళిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే హీరోలు ఎన్టీఆట్, కళ్యాణ్ రామ్, నాని, మనోజ్, నిఖిల్, అఖిల్ లాంటి వాళ్లంతా సినిమా సినిమా చూసి తమ అభిప్రాయాన్ని తెలిపారు.

తాజాగా మరో స్టార్ హీరో ధనుష్ కూడా సినిమా చూసి ఆశ్చర్యపోతూ ‘వర్ణించడానికి మాటలు రావడంలేదు. సినిమాను అందరు థియేటర్లోనే చూడండి. ప్రభాస్ హార్డ్ వర్క్ చాలా గొప్పది’ అన్నారు. అలాగే హీరోయిన్లు రకుల్ ప్రీత్, మంజిమ మోహన్, నివేత థామస్ లాంటి వాళ్ళు కూడా పొగడ్తల వర్షం కురిపించారు. ఇక రిలీజైన ప్రతి చోట సినిమాకు కంనుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తూ మంచి పాజిటివ్ టాక్ వ్యాపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు