షూటింగ్ జరుపుకుంటున్న ఛార్మీ మంత్ర 2

షూటింగ్ జరుపుకుంటున్న ఛార్మీ మంత్ర 2

Published on Apr 23, 2014 11:00 PM IST

charmi
మంత్ర సినిమా విడుదలై 7 ఏళ్ళు గడిచాక ఇప్పుడు ఛార్మీ మంత్ర 2 కోసం సిద్ధపడుతుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఇటీవలే ప్రారంభమయ్యింది. గతయేడాదే ఈ సినిమా ప్రారంభమయినా కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ కి కామా పెట్టారు

ప్రస్తుతం తాను ఒప్పుకున్నా అన్ని సినిమాలు ముగించిన ఛార్మీ మంత్ర 2పై దృష్టిపెట్టింది. చక్రం లో ‘జగమంత కుటుంబం నాది’ తీసిన చోటే మంత్ర 2 షూటింగ్ జరుపుకుంటున్నాం అని ట్వీట్ చేసింది. ఈ సినిమాకు, మంత్ర సినిమాకు సంబంధం లేదని, పూర్తిగా కొత్త స్క్రిప్ట్ అని, తనకు చాలా నచ్చిందని ఛార్మీ చెప్పుకొచ్చింది

సతీష్ తీస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్, సౌరి రెడ్డి మరియు రవితేజ లు నిర్మిస్తున్నారు. శంకర్ సంగీతదర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు