శరవేగంగా సాగుతున్న చీకటిరాజ్యం షూటింగ్

శరవేగంగా సాగుతున్న చీకటిరాజ్యం షూటింగ్

Published on Jun 30, 2015 11:39 PM IST

Kamal-Cheekati-Rajyam
కమల్ హాసన్ నటిస్తున్న ‘చీకటి రాజ్యం’ చిత్రం తమిళ, తెలుగు బాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఒక్క రాత్రిలో జరిగే ఘటనల నేపధ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఒక ఫ్రెంచ్ సినిమా నుండి స్పూర్తి పొందినట్టు తెలుస్తుంది.

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. షూటింగ్ ని జులై చివరిలోపు ముగించే పనిలో వున్నారు. ప్రస్తుతం ప్రధాన తారాగణం నడుమ చెన్నైలో ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగిన విషయం విదితమే.

ప్రకాష్ రాజ్, సత్యరాజ్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్. మధుశాలిని ముఖ్యపాత్రధారి. కమల్ స్నేహితుడు రాజేష్ సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు