మెగా హీరో సినిమాలో అదిరిపోయే డ్యాన్సులు !

మెగా హీరో సినిమాలో అదిరిపోయే డ్యాన్సులు !

Published on Jul 24, 2017 5:50 PM IST


మెగా హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది హుషారెత్తించే డ్యాన్సులు. అవే వారిని అందరిలోకి కాస్త ప్రత్యేకంగా నిలబెడుతుంటాయి. ఇక యువ హీరోల్లో చరణ్, బన్నీలతో సమానంగా సాయి ధరమ్ తేజ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేయగలడు. అందుకే ఆయన సినిమా అంటే మెగా ఫ్యాన్స్ పాటలు, వాటిలోని డ్యాన్సుల విషయంలో కొంచెం పట్టింపుగా ఉంటారు. ఆ విషయం తెల్సిన తేజ్ తన సినిమాల్లో అభిమానుల్ని సంతృప్తిపరచేలా డ్యాన్సులు ఉండేలా చూసుకుంటాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘జవాన్’ సినిమాలో అలాంటి డ్యాన్సులే ఉండనున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చిత్రీకరణ జరుగుతున్న ఒక మాస్ పాటలో తేజ్ ఎలాంటి కట్స్ లేకుండా కంటిన్యూస్ గా నిముషం పాటు వేసే స్టెప్ ఒకటుందట. కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన షూటింగ్లో దాన్ని చిత్రీకరించారట. అది ఫ్యాన్స్ కు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. బివిఎస్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తుండగా సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు