షూటింగ్స్ ని స్లో చేసిన ఫైనాన్సియల్ ఇబ్బందులు.!

షూటింగ్స్ ని స్లో చేసిన ఫైనాన్సియల్ ఇబ్బందులు.!

Published on Apr 20, 2014 6:35 PM IST

Telugu-Film-Industry
ప్రస్తుతం కొత్త తెలుగు సినిమాలు ఫైనాన్సియల్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న చాలా సినిమాల పరిస్థితి ఇదే..ఫేమస్ ట్రేడ్ పండితులు టాలీవుడ్ మునుపెన్నడూ లేని విధంగా ఫైనాన్షియల్ ఇబ్బందులను ఎదుర్కుంటోందని అంటున్నారు.

త్వరలో మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. దానికోసం అన్ని పొలిటికల్ పార్టీలు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అందరు లీడర్స్ డబ్బులు పంచడం కోసం ఫైనాన్సియర్స్ నుండి భారీగా డబ్బులు తీసుకుంటున్నారు. దీనివల్ల ఫైనాన్సియల్ సమస్యలు వస్తున్నాయి.

మరోవైపు ఐపిఎల్ సీజన్ కూడా మొదలవడంతో చాలా డబ్బు బెట్టింగ్ రూపంలో మాయమైపోతోంది. ప్రస్తుతం జరుగుతున్నా ఈ ఫైనాన్సియల్ సమస్య ఇంకో నెల రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎలక్షన్స్, ఐపిఎల్ ముగిసిన తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ మనీ కొరత తీరుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు