ఈ వారాంతం మూడు హిట్ సినిమాలకు బాగా కలిసి రానుంది !

ఈ వారాంతం మూడు హిట్ సినిమాలకు బాగా కలిసి రానుంది !

Published on Jan 19, 2017 5:59 PM IST

khaidi-gpsk-shatamanm
ఈ సంక్రాంతి సీజన్ సినిమాల సందడితో కోలాహలంగా గడవడమేగాక తెలుగు పరిశ్రమకు కూడా బాగా కాసుల వశం కురిపించి బాగా కలిసొచ్చింది. విడుదలైన మూడు చిత్రాల్లో ‘ఖైదీ నెం 150’ ఏపీ, తెలంగాణల్లో రూ. 76 కోట్ల గ్రాస్ వసూలు చేయగా బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రూ. 30 కోట్లపైనే షేర్ రాబట్టింది. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శతమానంభవతి’ కూడా 5 రోజుల్లో దాదాపు రూ. 12కోట్ల షేర్ వసూలు చేసింది. ఇలా కలెక్షన్ల పరంగా మంచి ఊపు మీదున్న ఈ సినిమాలకు ఈ వారాంతం బాగా కలిసిరానుంది.

ఎందుకంటే ఈ వారాంతంలో చిన్న పెద్ద సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కావడంలేదు. కాబట్టి ప్రతి చిత్రానికి ఇప్పటి వరకు ఎన్ని థియేటర్లున్నాయో అన్ని ఈ వారాంతం కూడా కొనసాగనున్నాయి. దీంతో ఈ సినిమాల కలెక్షన్లు దాదాపు పోయిన వారంతం ఎలా ఉన్నాయో ఈ వారాంతం కూడా అలాగే స్టడీగా కొనసాగే అవకాశముంది. అంతేగాక జనవరి 25, 26 లో కూడా రెండు డబ్బింగ్ చిత్రాలు మినహా మరే స్ట్రయిట్ సినిమా లేకపోవడంతో వచ్చే బుధవారం వరకూ వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవడానికి ఈ మూడు సినిమాలకు మంచి అవకాశమని చెప్పొచ్చు. ఆ విషయాన్నే గ్రహించిన మూడు టీమ్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తూ చిత్రాల మైలేజ్ పెంచేందుకు కృషి చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు