ప్రతాప రుద్రుడిని పక్కనపెట్టిన గుణశేఖర్!

ప్రతాప రుద్రుడిని పక్కనపెట్టిన గుణశేఖర్!

Published on Dec 11, 2016 4:05 PM IST

guna-shekar
దర్శకుడు గుణ శేఖర్ ఏళ్ళ పాటు శ్రమించి, తన కలల ప్రాజెక్టుగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రుద్రమదేవికి మరో భాగంగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తానని చెప్పిన గుణశేఖర్, అందుకు సంబంధించిన రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ సినిమాను పక్కనపెట్టి ‘హిరణ్య కషిప : స్టోరీ ఆఫ్ భక్తప్రహ్లాద’ పేరుతో గుణశేఖర్ మరో చారిత్రక సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఆయన తెలిపారు.

ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తానే స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో టైటిల్ రోల్‌లో నటిస్తారని గుణశేఖర్ తెలిపారు. ఇక ఆ స్టార్ హీరో ఎవరు, ఆ ప్రొడక్షన్ హౌస్ ఏంటి? అన్నది వచ్చేనెలలో ప్రకటిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక 2018లో మళ్ళీ ప్రతాప రుద్రుడు గురించి ఆలోచిస్తానని గుణశేఖర్ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు