న్యూజెర్సీలో బాలయ్యకు అదిరిపోయే స్వాగతం!

న్యూజెర్సీలో బాలయ్యకు అదిరిపోయే స్వాగతం!

Published on Jan 23, 2017 10:28 AM IST

bala-krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా విడుదలై విజయపథంలో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలను అందుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. బాలయ్యకు పెద్దగా మార్కెట్‌లేని యూఎస్‌లోనూ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి అక్కడ కూడా పెద్ద హిట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే యూఎస్‌లో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచనతో బాలయ్య తన టీమ్‌తో కలిసి యూఎస్ టూర్‌కు వెళ్ళారు. చివరిరోజైన ఆదివారం బాలయ్య న్యూజెర్సీకి వెళ్ళగా, అక్కడ సుమారు 100 కార్లలో ర్యాలీగా వచ్చి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సుదూర ప్రాంతాల నుంచి బాలయ్యను కలిసేందుకు అభిమానులు ఉత్సాహం కనబరిచారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం బాలయ్య ఇండియా బయలుదేరతారు.

bala

సంబంధిత సమాచారం

తాజా వార్తలు