ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ – కష్టపడితే.. సక్సెస్ అదే వస్తుంది!

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ – కష్టపడితే.. సక్సెస్ అదే వస్తుంది!

Published on Apr 19, 2016 3:51 PM IST

Rakhul-preeth
ప్రస్తుతం తెలుగులో వరుసగా టాప్ హీరోల సినిమాలను చేజక్కించుకుంటూ దూసుకెళుతోన్న స్టార్ హీరోయిన్, రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా అల్లు అర్జున్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘సరైనోడు’ సినిమా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న) ముందుగా, ‘సరైనోడు’కి మీరే డబ్బింగ్ చెప్పారని వినిపిస్తోంది. నిజమేనా?

స) లేదు. ‘సరైనోడు’లో నేను గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్రకు నా వాయిస్ సెట్ అవ్వదని డబ్బింగ్ చెప్పలేదు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నేను మహాలక్ష్మి అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. సరదా సరదాగా సాగిపోయే పాత్ర అది. అల్లు అర్జున్‌ పాత్రకు, నా పాత్రకు మధ్యన లవ్ కొత్తగా ఉంటుంది. భోయపాటి శీను ఈ పార్ట్‌ను చక్కగా డీల్ చేశారు.

ప్రశ్న) ఈ పాత్ర కోసం ముందస్తుగా ఏదైనా ట్రైనింగ్ చేశారా?

స) అలాంటిదేమీ లేదు. దర్శకుడు భోయపాటి శీను చెప్పినట్లే, ఆయన ఆలోచనలకు తగ్గట్టే చేస్తూ పోయా.

ప్రశ్న) దర్శకుడు భోయపాటి గురించి చెప్పండి?

స) ఏం చెప్పాలన్నదానిపై ఆయనకు చాలా క్లారిటీ ఉంటుంది. మనకు ఎలా అయితే కథను చెప్తారో, సినిమా కూడా అలాగే ఉండేలా జాగ్రత్త పడతారు. కథగా పేపర్‌పై ఏదైతే చూస్తామో, అదే సినిమాలోనూ ఉండడం భోయపాటి స్టైల్!

ప్రశ్న) అల్లు అర్జున్, డ్యాన్సుల్లో స్టార్. ఆయన ఎనర్జీని ఎలా అందుకున్నారు?

స) నిజంగానే డ్యాన్సుల్లో బన్నీ ఎనర్జీని అందుకోవడం కష్టమే! నా వరకూ నేను డ్యాన్సెస్ కోసమే చాలా సమయం కేటాయించి బన్నీ సరసన డ్యాన్స్ చేయగలిగా.

ప్రశ్న) కమర్షియల్ సినిమాల్లోనే హీరోయిన్‍గా నటిస్తోండడం బోర్ అనిపించట్లేదా?

స) అస్సలు లేదు. నేనిప్పుడు చేస్తున్న సినిమాలన్నీ ఎంతో ఇష్టపడే చేస్తున్నా. అయితే ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ లాంటి ఓ ప్రేమకథలో నటించాలని మాత్రం ఎప్పుడూ ఉంది.

ప్రశ్న) టాలీవుడ్‌లో మీ కెరీర్ ఎలా ఉందనుకుంటున్నారు?

స) అంతా బాగుంది. నాకు వస్తోన్న అవకాశాలు, ఇక్కడి ఇండస్ట్రీ, ప్రేక్షకుల సపోర్ట్ మరచిపోలేను. ప్రేక్షకులు నన్ను ఇంత బాగా ఆదరిస్తూ ఉండడం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా.

ప్రశ్న) టాలీవుడ్‌లో మీ సక్సెస్‌కి కారణం ఏమనుకుంటున్నారు?

స) మన పని మనం సరిగ్గా చేస్తూ పోతే సక్సెస్ దానంతటదే వస్తుంది. ఈ విషయాన్ని బలంగా నమ్మే, నేను నా వంతుగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటా.

ప్రశ్న) పూర్తిగా హైద్రాబాద్‌లోనే సెటిల్ అయిపోయినట్టునారు?

స) అవును. హైద్రాబాద్‍లోనే సొంత ఇల్లు కొని పూర్తిగా ఇక్కడే ఉంటున్నా. అలాగే ఈ మధ్యే మొదలుపెట్టిన ఫిట్‌నెస్ బిజినెస్ కూడా బాగా నడుస్తోంది. హైద్రాబాద్ నాకు బాగా నచ్చేసింది.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?

స) ‘సరైనోడు’ తర్వాత వరుణ్ తేజ్‌తో ఓ సినిమా, సాయి ధరమ్ తేజ్‌తో ఓ సినిమా చేయనున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు