బోయపాటి సినిమాలో ‘కంచె’ హీరోయిన్!

బోయపాటి సినిమాలో ‘కంచె’ హీరోయిన్!

Published on Dec 8, 2016 3:45 PM IST

Pragya
‘సరైనోడు’తో బంపర్ హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్ కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేశారు. కంచె సినిమాతో పరిచయమై హీరోయిన్‌గా పలు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోన్న ప్ర్రగ్యా, ఈ సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపిస్తారట.

ద్వారకా క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా బోయపాటి స్టైల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. సాయిశ్రీనివాస్ చేసిన ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’.. రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపకపోవడంతో ఈ సినిమాపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు