సంచలనం సృష్టిస్తున్న కిక్ 2 టీజర్

సంచలనం సృష్టిస్తున్న కిక్ 2 టీజర్

Published on Jan 30, 2015 8:14 AM IST

Kick2
సినిమా ప్రపంచానికి సోషల్ నెట్వర్క్ ప్రాధాన్యత ఏమిటో మరోసారి రుజువయ్యింది. రవితేజ నటించిన ‘కిక్ 2’ సినిమా టీజర్ మన మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 26న విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ టీజర్ ఇప్పుడు కేవలం మూడు రోజుల్లో 7 లక్షల హిట్లను దాటింది. రవితేజ, సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో ‘కిక్’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసినదే.

ఈ క్రేజీ కాంబినేషన్ కు మనోజ్ పరమహంస చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రశంసలను పొందింది.

కిక్ 2 లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ నిర్మాణ సంస్థనుండి వచ్చిన ‘పటాస్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసినదే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు