ఇంటర్వ్యూ : సిమ్రాన్ పరీన్జ, సంయుక్త హెగ్డే – ఇది పైసా వసూల్ సినిమా

ఇంటర్వ్యూ : సిమ్రాన్ పరీన్జ, సంయుక్త హెగ్డే – ఇది పైసా వసూల్ సినిమా

Published on Mar 15, 2018 6:33 PM IST

నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టి’ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా అందులో హీరోయిన్లుగా నటించిన సిమ్రాన్ పరీన్జ మరియు సంయుక్త హెగ్డేలు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సిమ్రన్.. మీరు చెప్పండి మీ పాత్ర గురించి ?

జ) ఈ సినిమాలో నా పాత్ర చాలా సాధారణంగా ఉంటుంది. నా పాత్ర పేరు మీర. తక్కువగా మాట్లాడే అమ్మాయి. సీరియస్ గా కనిపిస్తాను. షూటింగ్ సమయంలో ఈ పాత్ర చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాను.

ప్ర) మీ పాత్ర ఎలా ఉంటుంది సంయుక్త ?

జ) నా పాత్ర సిమ్రన్ పాత్రకు భిన్నంగా ఉంటుంది. నిఖిల్ తో నేను నటించిన సన్నివేశాలు ఎనర్జిటిక్ గా ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు సత్య. ఈ సినిమా కన్నడ వెర్షన్ లో నేను ఇదే పాత్ర చెయ్యడం జరిగింది.

ప్ర) ‘కిరాక్ పార్టీ’ నుండి ప్రజలు ఏం ఆశించవచ్చు ?

జ) ఇది పక్కా పైసా వసూల్ సినిమా. ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరికి వారి కాలేజ్ డేస్ గుర్తుకు వస్తాయి. ఈతరం ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ప్ర) సిమ్రన్ మీరు రష్మిక పాత్రను తెలుగులో చేసారు, దాని గురించి చెప్పండి.

జ) అవును ఒరిజినల్ వెర్షన్ లో ఆమె బాగా నటించింది. నేను నా వరుకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. నా పాత్రకు చిన్న చిన్న మార్పులు చెయ్యడం జరిగింది. అందరికి నా పాత్ర నచ్చుతుందని అనుకుంటున్నాను.

ప్ర) అంటే ఆమెను ఫాలో అయ్యారా ?

జ) లేదు. ఈ సినిమాలో పూర్తిగా నేనే కనిపిస్తాను. ఆమెలా కాకుండా నాలా నేను నటించాను.

ప్ర) నిఖిల్ తో వర్క్ చెయ్యడం ఎలా ఉంది ?

జ) తెలుగులో మేము చేస్తోన్న మొదటి సినిమాకు నిఖిల్ బాగా హెల్ప్ చేసాడు. అతను కంఫర్టబుల్ ఆర్టిస్ట్. యాక్టింగ్ పరంగా కూడా అతను చాలా పర్ఫెక్ట్. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా ఉంటాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు