బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతోన్న మహేశ్..!

బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతోన్న మహేశ్..!

Published on Apr 1, 2015 10:18 AM IST

mahesh_babu4
సూపర్‌స్టార్ మహేష్ సినిమా వస్తుందంటే చాలు.. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి, అంచనాలు పెరిగిపోతాయ్! అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా ఉంటాయన్నది వాస్తవం. ఓపెనింగ్స్ సంగతి పక్కనపెడితే లాంగ్‌రన్‌లో సినిమా మంచి కలెక్షన్లను సాధించాలంటే తప్పకుండా హిట్ అయి తీరాలి. మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. అది ఏ రేంజ్‌లో వసూళ్ళు సాధిస్తుందనేది చెప్పే పనిలేదు. అయితే మహేష్ గత రెండు సినిమాలకు హిట్ టాక్ రాకపోవడం, బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు పరాజయాన్ని చవిచూడడం వంటి విషయాల వల్ల మహేష్ అలర్ట్ అయ్యారట. గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా మరీ వీక్‌గా లేకపోయినా, విపరీతంగా పెరిగిపోయిన బడ్జెట్ వల్ల ఆ సినిమాలు నష్టాలను మిగిల్చాయ్.

దాంతో ఇక బడ్జెట్ విషయంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న కొరటాల శివ సినిమా ‘శ్రీమంతుడు’ బడ్జెట్ పెరగకుండా ఉండడానికి పక్కా ప్లాన్ ప్రకారమే సెట్స్‌పైకి వెళ్ళారట. ఈ సినిమా కోసం మహేష్ తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక స్టార్ హీరో ఇలా బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు పాటించడం నిర్మాతకు చాలా మేలు చేకూరుస్తుందనేది సినీ వర్గాల అభిప్రాయం. ఇక శ్రీమంతుడు సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు