టైటిల్ తో నందమూరి అభిమానుల్ని పడేసిన నారా రోహిత్ !

టైటిల్ తో నందమూరి అభిమానుల్ని పడేసిన నారా రోహిత్ !

Published on Jul 24, 2017 5:27 PM IST


యంగ్ హీరో నారా రోహిత్ చేస్తున్న చిత్రాల్లో పవన్ మల్లెల డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ఒకటి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రేపు రోహిత్ పుట్టినరోజు సందర్బంగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇందులో రోహిత్ బాగా సన్నబడి సిక్స్ ప్యాక్ లుక్ తో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దీంతోపాటు సినిమా టైటిల్ ‘బాలకృష్ణుడు’ అని కూడా ప్రకటించారు.

ఆ టైటిల్ లో బాలకృష్ణ పేరు ఉండటంతో నందమూరి అభిమానులు ఇంప్రెస్ అవుతున్నారు. ఈ అంశం సినిమాకు కొంచెం కలిసొచ్చేదిగా ఉండనుంది. రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సెప్టెంబర్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు