సర్ప్రైజింగ్ : ఈ 14 భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హీరామండి”

సర్ప్రైజింగ్ : ఈ 14 భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హీరామండి”

Published on May 1, 2024 1:05 PM IST

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఓటిటి వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) తెరకెక్కించిన అవైటెడ్ సిరీస్ “హీరామండి : ది డైమండ్ బజార్” (Heeramandi : The Diamond Bazaar) అనే చెప్పాలి.

బాలీవుడ్ ప్రముఖ తారలు మెయిన్ గా ఫీమేల్ నటులు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి (Aditi Rao Hydari), రిచా ఛధా అలాగే షర్మిన్ సెగల్, సంజీదా షైక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి హైప్ ని సెట్ చేసుకొని గత కొన్ని రోజులుగా సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా ఈ సిరీస్ జరుపుకుంది.

అయితే ఈరోజు మే 1 నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది కానీ ఈ సిరీస్ రాత్రి 12 నుంచి చూసినా ఎక్కడా కనిపించలేదు. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ మధ్యాహ్నం నుంచి నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. సర్ప్రైజింగ్ గా ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం.

పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్, అరబిక్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్, మలయ్, పోలిష్, స్పానిష్ అలాగే థాయ్ భాషల్లో ఈ సిరీస్ ఇప్పుడు వచ్చింది. మరి ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు