తారక్ పై బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసక్తికర పోస్ట్

తారక్ పై బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసక్తికర పోస్ట్

Published on May 1, 2024 10:55 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసే రెండు భారీ చిత్రాలు “వార్ 2”, “దేవర” లు చేస్తుండగా ఇప్పుడు నార్త్ లో వార్ 2 తో బిజీగా ఉన్నాడు. ఇక క్రమంలో రీసెంట్ గానే ఓ పార్టీని కూడా తారక్ అటెండ్ అవ్వడంతో ఆ పిక్స్ అంతా వైరల్ గా మారాయి. అయితే లేటెస్ట్ గా మరో పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) తారక్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) నటుడు పోస్ట్ చేశారు. అలాగే తన పనితనం ఎంతో ఇష్టమని తారక్ కి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నాను జైహో అంటూ తనతో కలిసి ఉన్న ఫోటో ఆర్ ఆర్ ఆర్ చిత్రం (RRR Movie)దోస్తీ సాంగ్ తో కలిపి షేర్ చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు