అజిత్ బర్త్ డే కి అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చిన షాలిని!

అజిత్ బర్త్ డే కి అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చిన షాలిని!

Published on May 1, 2024 11:12 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరిసారిగా తునివు చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విడా ముయార్చి చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు అజిత్ యొక్క 53వ పుట్టినరోజు. అజిత్ పుట్టిన రోజు సందర్భంగా అతని ప్రియమైన భార్య, మాజీ నటి షాలిని అజిత్ కుమార్, అతనికి అద్భుతమైన బహుమతి అందించింది.

డుకాటీ తో అతనిని ఆశ్చర్య పరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడా ముయార్చితో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని చేస్తున్నారు అజిత్. ప్రఖ్యాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రం కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు