ఓ రేంజ్ హైప్ ఇస్తున్న “పుష్ప 2 ది రూల్” ఫస్ట్ సింగిల్ లేటెస్ట్ పోస్టర్!

ఓ రేంజ్ హైప్ ఇస్తున్న “పుష్ప 2 ది రూల్” ఫస్ట్ సింగిల్ లేటెస్ట్ పోస్టర్!

Published on May 1, 2024 12:14 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయిన పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయగా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు సాయంత్రం 5:04 గంటలకి రిలీజ్ చేయనున్నారు.

పుష్ప పుష్ప అంటూ సాగే పాటను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే మేకర్స్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది పోస్టర్ల ద్వారా తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ మాస్ స్వాగ్ తగ్గేదేలే అనే విధంగా పోస్టర్లు ఉంటున్నాయి. ఈ లేటెస్ట్ పోస్టర్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్నఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు