సస్పెన్స్ థ్రిల్లర్ కథలను జడ్జ్ చేయడంలో నిఖిల్ నెంబర్ 1

సస్పెన్స్ థ్రిల్లర్ కథలను జడ్జ్ చేయడంలో నిఖిల్ నెంబర్ 1

Published on Oct 25, 2014 3:52 PM IST

Karthikeya

రొటీన్ అనే పదానికి చెక్ పెడుతూ కొత్త కథలకు, కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ విజయాలు అందుకుంటున్నాడు యువ హీరో నిఖిల్. ‘హ్యాపీ డేస్’తో హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్, తర్వాత అరడజను సినిమాలలో సోలో హీరోగా నటించాడు. అవి అంతగా పేరు తీసుకురాలేదు. కాని, ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు అతని కెరీర్ గ్రాఫ్ ను అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళాయి.

‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ సినిమాలు నిఖిల్ కు మధురమైన విజయాలను అందించాయి. ఈ రెండు థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. దర్శకులు ఇద్దరికీ మొదటి సినిమా కావడం మరో విశేషం. కమర్షియల్ అనే ముసుగు వేసి రొటీన్ సినిమా తీసి ప్రేక్షకులను విసిగించడం కంటే, డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్ లతో కమర్షియల్ గా సక్సెస్ సాదించే సినిమాలు తీయొచ్చని నిఖిల్ చేతలలో చూపించాడు. ‘స్వామి రా రా’ తర్వాత తెలుగులో చాలా రోజుల తర్వాత క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ హడావుడి మొదలైంది. చాలా మంది దర్శకులు అటువంటి సినిమాలు తీసినా విజయాలు అందుకోలేకపోయారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథలను పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయడంలో తను ఎక్స్పర్ట్ అని ‘కార్తికేయ’ సినిమాతో మరోసారి నిరూపించాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు